Jharkhand : అంబులెన్స్‌ల మాదిరిగా స్కూల్‌ బస్సులకూ దారివ్వాలి..

రోడ్డుపై అంబులెన్స్‌ వెళ్తుంటే అందరూ అడ్డు తప్పుకొని ఎలా అయితే దానికి దారి ఇస్తామో అలాగే  పాఠశాల బస్సలకు  దారివ్వాలని ఝూర్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అన్నారు.

Published : 23 Apr 2022 12:02 IST

రాంచీ: రోడ్డుపై అంబులెన్స్‌ వెళ్తుంటే అందరూ అడ్డు తప్పుకొని ఎలా అయితే దానికి దారి ఇస్తారో అలాగే  పాఠశాల బస్సులకు  దారివ్వాలని ఝూర్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ కోరారు. ఎండవేడిని, బస్సులోని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని పాఠశాల బస్సులకు దారివ్వాలన్నారు. శుక్రవారం డోరాండాలోని సెయింట్‌ జేవియర్స్‌ పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నారులు ఎండవేడికి తట్టుకోలేరు. అందుకే అందరూ అంబులెన్స్‌కు ఇచ్చే ప్రాధాన్యం ఇకపై స్కూల్‌ బస్సులకు కూడా ఇవ్వండి. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది’ అని అన్నారు.

ఇక ఝూర్ఖండ్‌లోని చాలా ప్రాంతాల్లో వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్‌ 24 నుంచి అధిక స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రాంచీ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. విద్యాశాఖ ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పాఠశాలల నిర్వహణ సమయాల్లో మార్పులు చేసింది. అన్ని పాఠశాలలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పనిచేయాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని