Himachal Pradesh: క్రాస్‌ ఓటింగ్‌ ఎఫెక్ట్‌.. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

హిమాచల్‌ ప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో భాజపాకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీప్‌ సింగ్‌ అనర్హత వేటు వేశారు. 

Updated : 29 Feb 2024 14:07 IST

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీప్‌ సింగ్ పథానియా (Kuldeep Singh Pathanian) వారిని ఎమ్మెల్యే సభ్యత్వాల నుంచి తొలగించారు. కాంగ్రెస్‌ తరఫున గెలిచి  పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

భాజపాకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన ఈ ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయడంతో స్పీకర్‌ ఈ చర్య తీసుకున్నారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో మొత్తం 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌ జరిగిన విషయం తెలిసిందే.  హిమాచల్‌లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడటంతో ఆ పార్టీ అభ్యర్థికి భాజపా అభ్యర్థికి సరిసమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో టాస్‌ వేయగా భాజపా అభ్యర్థిని విజయం వరించింది.

‘సందేశ్‌ఖాలీ’ నిందితుడు షాజహాన్‌ షేక్‌ అరెస్టు

ఈ క్రమంలోనే మంత్రి విక్రమాదిత్య సింగ్‌ రాజీనామా చేయడం హస్తం పార్టీకి తలపోటుగా మారింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు భాజపా ప్రతినిధివర్గం గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాను కలిసినట్లు సమాచారం. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే ఆందోళనకు దిగిన 15 మంది భాజపా ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై తాజాగా అనర్హత వేటు విధించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని