Secunderabad-Agartala Express: సికింద్రాబాద్‌-అగర్తల ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ఒడిశాలో ఘటన

Secunderabad-Agartala Express: ఒడిశాలో మరో రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. సికింద్రాబాద్‌-అగర్తల ఎక్స్‌ప్రెస్‌ ఏసీ బోగీలో మంటలు చెలరేగి పొగలు కమ్మేశాయి.

Updated : 06 Jun 2023 16:46 IST

భువనేశ్వర్‌: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని 278 మంది దుర్మరణం చెందిన ఘోర ప్రమాదాన్ని (Odisha Train Tragedy) మరవకముందే మరో రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. సికింద్రాబాద్‌-అగర్తల ఎక్స్‌ప్రెస్‌ (Secunderabad-Agartala Express)లోని ఓ బోగీలో పొగలు కమ్మేశాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సికింద్రాబాద్‌ - అగర్తల ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒడిశాలోని బరంపూర్ రైల్వే స్టేషన్‌లో ఆగినప్పుడు బి-5 ఏసీ కోచ్‌ నుంచి పొగలు (Smoke) రావడం ప్రయాణికులు గుర్తించారు. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే బోగీ నుంచి దిగిపోయి రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. ఏసీలో మంటలు వచ్చినట్లు గుర్తించిన సిబ్బంది వాటిని ఆర్పివేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. అయితే, ఈ పరిణామంతో ప్రయాణికులు కంగారుపడ్డారు. కొందరు ప్రయాణికులు మళ్లీ బోగీ ఎక్కేందుకు నిరాకరించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో కొంతసేపు స్టేషన్‌లో నిలిచిన రైలు.. 45 నిమిషాల తర్వాత తిరిగి గమ్యస్థానానికి బయల్దేరింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని