ఎన్డీయే ఏకపక్ష ధోరణి ఇకపై చెల్లదు.. సోనియా గాంధీ

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Published : 09 Jun 2024 00:05 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ (CPP)గా సోనియాగాంధీ తిరిగి ఎన్నికయ్యారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఎంపీలు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. మొదట సోనియాగాంధీ పేరును కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించగా.. నేతలు గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్‌ ఆయనకు మద్దతు తెలిపారు. తర్వాత లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల మద్దతు లభించింది.

నీతీశ్‌కు ప్రధానిగా ఇండియా కూటమి ఆఫర్‌..!

సీపీపీ నాయకురాలిగా ఎన్నికైన తర్వాత పార్టీ ఎంపీలను ఉద్దేశించి సోనియాగాంధీ మాట్లాడుతూ క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు.‘‘ సీపీపీ సభ్యులుగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉంది. పదేళ్లు పార్లమెంటులోని ఎన్డీయే ఏకపక్ష ధోరణి ఇకపై చెల్లదు’’ అని అన్నారు. గత లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధినేత్రిగా పనిచేసిన ఆమె మళ్లీ ఈ పదవికి ఎన్నికయ్యారు. 20ఏళ్ల పాటు లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న సోనియా ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని