Suicide Bomb Attack: చైనీయులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి.. ఎక్కడంటే?

పాకిస్థాన్‌లో చైనీయులు లక్ష్యంగా మరో దాడి జరిగింది. ఆ దేశ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ఒక చైనీయుడు గాయపడగా, సమీపంలో ఆడుకుంటున్న ఇద్దరు స్థానిక చిన్నారులు మృతి చెందారు. బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని గ్వాదర్‌లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది...

Published : 21 Aug 2021 23:38 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో చైనీయులే లక్ష్యంగా మరో దాడి జరిగింది. ఆ దేశ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ఒక చైనీయుడు గాయపడగా, సమీపంలో ఆడుకుంటున్న ఇద్దరు స్థానిక చిన్నారులు మృతి చెందారు. బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని గ్వాదర్‌లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఇస్లామాబాద్‌లోని చైనా రాయబార కార్యాలయం శనివారం ధ్రువీకరించింది. ఈ ఉగ్రవాద చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని పాక్‌కు సూచించింది. ఇదిలా ఉండగా.. ఈ దుశ్చర్యపై ఇంతవరకు ఏ సంస్థా బాధ్యత తీసుకోలేదు. జులైలోనూ ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతంలో బస్సుపై జరిగిన దాడిలో తొమ్మిది మంది చైనా జాతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని ఉపయోగించుకునే శక్తులను వ్యతిరేకిస్తున్నట్లు చైనా అప్పట్లో పేర్కొనడం గమనార్హం. పాక్‌లో ‘డ్రాగన్‌’ అనేక అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని