Farmers Protest: శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత.. రైతులపై బాష్పవాయువు

Farmers Protest: శంభు సరిహద్దు వద్ద రైతులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. 

Updated : 13 Feb 2024 15:23 IST

దిల్లీ: రైతులు తలపెట్టిన మెగా మార్చ్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పంజాబ్, హరియాణా మధ్య ఉన్న శంభు సరిహద్దు( Shambhu border) వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన రైతులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. దిల్లీ దిశగా కదులుతున్న వారిని అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

‘దిల్లీ చలో’..రాజధాని సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్‌జామ్‌

బాష్పవాయువు ప్రయోగంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే బలగాలు డ్రోన్లతో స్మోక్‌ బాంబ్స్‌ను జారవిడిచారు. దీంతో నిరసనకారులు, మీడియా ప్రతినిధులు పరుగులుపెట్టినట్లు తెలుస్తోంది. 

ఆందోళనకారులు వారి ప్రణాళిక ప్రకారం ‘దిల్లీ చలో’ మార్చ్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే పంజాబ్‌-హరియాణా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను వారు బద్దలుకొట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు టియర్‌గ్యాస్‌ ప్రయోగించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో ఈ ఉదయం 10 గంటలకు పంజాబ్‌లోని ఫతేగఢ్‌ సాహిబ్‌ నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో దిల్లీ (Delhi)కి బయల్దేరారు. అటు సంగ్రూర్‌ నుంచి మరో బృందం దేశ రాజధాని వైపు కదిలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని