Arya Rajendran : అమ్మగా లాలిస్తోంది.. మేయర్‌గా పాలిస్తోంది!

తిరువనంతపురం (Thiruvananthapuram) మేయర్‌ ఆర్య రాజేంద్రన్‌ (Arya Rajendran) ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 

Published : 19 Sep 2023 01:37 IST

Image : Tamizhachi_Offl

తిరువనంతపురం : ఆర్య రాజేంద్రన్‌ (Arya Rajendran).. అతి పిన్న వయసులోనే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం (Thiruvananthapuram) మేయర్‌గా ఎన్నికై యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. 2020లో మేయర్‌గా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆమె వయసు 21 సంవత్సరాలే. కొన్ని రోజుల తర్వాత ఆర్య రాజేంద్రన్‌ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సచిన్‌ దేవ్‌ను పెళ్లి చేసుకుంది. ఆయన కూడా అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆగస్టు 10వ తేదీన ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. ప్రసవం జరిగి నెల దాటిందో లేదో.. ఆర్య రాజేంద్రన్‌ తన పాపను ఎత్తుకొని కార్యాలయానికి వెళ్లింది. బుజ్జాయిని ఒడిలో పెట్టుకునే పెండింగ్‌ దస్త్రాలను పరిశీలించింది. ఆ సమయంలో తీసిన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. మాతృత్వపు మాధ్యుర్యాన్ని ఆస్వాదిస్తూనే.. ప్రజలు అప్పగించిన బాధ్యతను ఆమె నెరవేరుస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

ఆదిత్య ఎల్‌1 పరిశోధనలు ప్రారంభం.. మరికొన్ని గంటల్లో సూర్యుడి దిశగా ప్రయాణం

వృత్తి, వ్యక్తిగత బాధ్యతలు రెండింటినీ సునాయాసంగా నిర్వహిస్తూ ఎంతో మంది మహిళలకు ఆర్య రాజేంద్రన్‌ ఆదర్శంగా నిలుస్తోందని పలువురు కొనియాడారు. మహిళలు పని చేసే ప్రదేశాల్లో తప్పకుండా పిల్లలను చూసుకోవడానికి సదుపాయాలు ఉండాలని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఇంట్లోని పిల్లలను తీసుకురాకూడదని గత ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు ప్రస్తావించారు. ఈ ఫొటోకు అభినందనలు మాత్రమే కాదు.. విమర్శలు సైతం వచ్చాయి. ఆర్య రాజేంద్రన్‌ ఫొటో కోసమే అలా చేశారని ట్రోల్‌ చేశారు. ఆమె ఉన్నత స్థానంలో కొనసాగుతోంది కాబట్టే ఇది సాధ్యమైందని.. సాధారణ మహిళా ఉద్యోగులు, కార్మికుల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని