పట్టపగలే నేత దారుణ హత్య.. అనుమానితుడిని కొట్టి చంపిన స్థానికులు

పట్టపగలే పశ్చిమ్ బెంగాల్‌లో హత్య జరిగింది. టీఎంసీ(TMC) నేతను కొందరు దుండగులు కాల్పి చంపారు.

Published : 13 Nov 2023 17:40 IST

కోల్‌కతా: పట్టపగలే తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC)కు చెందిన నేత దారుణ హత్యకు గురయ్యారు. పశ్చిమ్‌ బెంగాల్‌(West Bengal)లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుందని మీడియా కథనాలు వెల్లడించాయి.  ఈ హత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తోన్న వ్యక్తి.. స్థానికుల దాడిలో మృతి చెందాడు.

టీఎంసీకి చెందిన సైఫుద్దీన్‌ లస్కర్ వెళ్తుండగా.. కొందరు దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. తక్షణమే స్పందించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అతడు మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. లస్కర్‌పై కాల్పులు జరిపిన దుండగుల్ని స్థానికులు వెంటపడి పట్టుకున్నారు. తర్వాత వారిపై దాడి చేయగా.. ఒకరు మృతి చెందారు. లస్కర్‌పై కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తోన్న ఆ ఇద్దరు వ్యక్తులు సీపీఎంకు చెందిన వారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మహువా మొయిత్రాకు టీఎంసీ కొత్త బాధ్యతలు

లస్కర్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కుమారుడు బహిరంగ ర్యాలీలు నిర్వహిస్తున్నాడు. నాకు తెలిసి అతడికి ఎవరితో శత్రుత్వం లేదు. అతడు ఇతరులకు సహాయం చేయాలనే చూస్తాడు.  అధికార టీఎంసీలో ఉండటమే అతడు చేసిన తప్పు. స్థానికంగా అధికారం కోసం సీపీఎం నేతలు ఈ హత్యకు పాల్పడ్డారు’ అని  తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే సీపీఎం పార్టీ ఈ ఆరోపణలను ఖండించింది. లస్కర్ తన ప్రాంతంలో మాఫియా రాజ్‌ను నడుపుతున్నాడని నిందించింది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనతో స్థానికులు సీపీఎం నేతల ఇళ్లకు నిప్పంటించారు. ఐదు ఇళ్ల వరకు దగ్ధమయ్యాయని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని