Chandrayaan-3: లాంచింగ్‌ నుంచి ల్యాండింగ్‌ వరకు.. 60 సెకన్లలో చంద్రయాన్‌-3 ప్రయాణం

మరికొద్ది గంటల్లో చంద్రయాన్‌-3 (Chandrayaan-3) జాబిల్లిపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ.. పీఐబీ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ ప్రయోగం లాంచింగ్‌ నుంచి ల్యాండింగ్‌ వరకు చంద్రయాన్‌-3 ప్రయాణాన్ని అందులో చూపించారు.

Updated : 22 Aug 2023 11:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కోట్లాది మంది భారతీయులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చారిత్రక క్షణాలు చేరువయ్యాయి. మరికొద్ది గంటల్లో మన వ్యోమనౌక జాబిల్లి (Moon) దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. జులై 14న శ్రీహరికోటలోని షార్‌ ప్రయోగ వేదిక నుంచి రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3).. బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండ్‌ కానున్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది. ఈ క్రమంలోనే 40 రోజుల చంద్రయాన్‌-3 ప్రయాణాన్ని 60 సెకన్లలో చూపిస్తూ PIB (ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో) ఓ వీడియో రూపొందించింది.

జయమ్ము నిశ్చయమ్మురా! ఏ ప్రతికూలత ఎదురైనా జాబిల్లిపై దిగి తీరాల్సిందే

ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు చంద్రయాన్‌-3 (Chandrayaan-3)ను రూపొందించినప్పటి నుంచి షార్‌ వేదిక వద్ద ప్రయోగం, రోదసిలోకి దూసుకెళ్లడం, భూకక్ష్యలో నుంచి చంద్రుడి కక్ష్యలోకి మారడం వంటివి ఇందులో చూపించారు. చివరగా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ అడుగుపెట్టినట్లు ఆ వీడియోలో ఉంది. విక్రమ్‌ ల్యాండర్‌ కిందకు దిగగానే అందులోని ప్రజ్ఞాన్‌ రోవడ్‌ జారుకుంటూ బయటకు వచ్చినట్లు ఊహాజనితంగా యానిమేషన్‌ రూపంలో వీడియోలో చూపించారు.

అన్ని అనుకూలిస్తే రేపు సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ కాలుమోపనుంది. ఆ తర్వాత రెండు వారాల పాటు ల్యాండర్‌, రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత జాబిల్లిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించనుంది. ఇక, దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా సరికొత్త చరిత్రను లిఖించనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు