VK Singh: త్వరలో పీవోకే భారత్‌లో కలుస్తుంది: వీకే సింగ్‌

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) భారత్‌లో తప్పకుండా కలుస్తుందని కేంద్రమంత్రి వీకే సింగ్‌ (VK Singh) ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated : 12 Sep 2023 11:17 IST

జైపుర్‌: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) భారత్‌లో తప్పకుండా కలుస్తుందంటూ.. కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్‌ (VK Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, అందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. సోమవారం రాజస్థాన్‌ (Rajasthan)లోని దౌసాలో జరిగిన పరివర్తన్‌ సంకల్ప్‌ యాత్ర కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

పీఓకే ప్రజలు భారత్‌లో కలవాలనుకోవడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘పీవోకే తనంతట తానే భారత్‌లో విలీనం అవుతుంది. అయితే, దానికి కొంతకాలం పట్టవొచ్చు’’ అని అన్నారు. అదే విధంగా భారత్‌ అధ్యక్షతన జీ20 సదస్సు విజయం సాధించిందని అన్నారు. ప్రపంచ వేదికపై భారత్‌ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుందని కొనియాడారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. శాంతి భద్రతలను కాపాడటంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించారు. ప్రజల సమస్యలను భాజపా నేరుగా వినాలనుకుంటోందని.. అందుకే ఈ యాత్రను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అందుకే తమతో కలిసి యాత్రలో పాల్గొంటున్నారని వీకే సింగ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని