Prudhvi Raj: ఆ పాత్ర నేను చేయాల్సింది.. తీసేసినందుకు బాధపడ్డా: పృథ్వీరాజ్‌

గతంలో తాను ఓ సినిమాలో పోషించాల్సిన పాత్ర క్యాన్సిల్‌ అయి, మరో నటుడు నటించడంతో బాధపడ్డానని పృథ్వీరాజ్‌ తెలిపారు. 

Published : 01 Nov 2023 18:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ అంటూ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు పృథ్వీరాజ్‌ (Prudhvi Raj). ఆయన తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలతోపాటు వ్యక్తిగత, రాజకీయ అంశాల గురించి మాట్లాడారు. నాటి దిగ్గజ నటులు కృష్ణ, ఎన్టీఆర్‌లతో తనకున్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. నటుడిగా తాను బాధపడిన సందర్భాల గురించి వివరించారు.

పెళ్లి విషయంలో ఒత్తిడికి గురవుతున్నా..: శ్రుతి హాసన్‌

‘‘రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కిన ఓ సినిమాలో నేను ఓ పాత్ర చేయాల్సి ఉంది. చిత్రీకరణకు రెడీ అవగా కో డైరెక్టర్‌ వచ్చి ఆ క్యారెక్టర్‌ మరొకరు చేస్తున్నారు అని చెప్పాడు. అసహనంతో వెనుదిరిగా. మరోవైపు, ‘దేవుళ్లు’ (Devullu) సినిమాలోని ‘అందరి బంధువయా’ పాటలో రాముడి పాత్ర పోషించేందుకు నన్ను, సీత పాత్ర కోసం నటి లయ, లక్ష్మణ పాత్ర కోసం మరో వ్యక్తిని ఎంపిక చేశారు దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయా పాత్రలకు తగ్గ మేకప్‌ వేసుకున్నాం. ఆ వేషధారణలో మమ్మల్ని చూసిన వారంతా బాగున్నారంటూ పొగిడారు. చిత్రీకరణ సమయంలో భద్రాచలం రామాలయం పూజారులు కూడా ‘ఎన్టీఆర్‌లా ఉన్నారు మీరు’ అని నాకు కాంప్లిమెంట్‌ ఇచ్చారు. మరుసటి రోజు షూటింగ్‌కు మేం సిద్ధమవుతుండగా అక్కడకు హీరో శ్రీకాంత్‌ వచ్చారు. ఈయన వేరే ఏదైనా పాత్రలో నటిస్తారేమోనని అనుకున్నా. కానీ, ఆయన రాముడి పాత్ర పోషిస్తారని తెలిసింది. దాంతో, చాలా బాధపడ్డా’’ అని తెలిపారు.

పృథ్వీ దర్శకుడిగాను మారారు. తన కూతురు శ్రీలు హీరోయిన్‌గా, క్రాంతి కృష్ణ హీరోగా ‘కొత్త రంగుల ప్రపంచం’ సినిమా తెరకెక్కించారు. నవంబరు 17న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు