Vikram: 23 సర్జరీలు.. మూడేళ్లు వీల్ ఛైర్‌లోనే..!
వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘విక్రమ్’ (Vikram). చిన్నతనంలో తనకు జరిగిన ప్రమాదం గురించి ఓ సందర్భంలో పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘విక్రమ్’ (Vikram). తమిళంలోనే కాదు, తెలుగులోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన ప్రతి సినిమా ఇక్కడ కూడా విడుదలవుతుంది. పాత్ర కోసం ఎంతటి కష్టానైనా భరిస్తారనడానికి ఐ, అపరిచితుడు చిత్రాలే ఉదాహరణ. ఒక స్టార్ హీరోగా ప్రేక్షకులకు తెలిసిన విక్రమ్ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. 12 ఏళ్ల వయసులో జరిగిన ఓ ప్రమాదంలో తన కాలును తీసేసే పరిస్థితి వచ్చిందంటే నమ్ముతారా?
చిన్నప్పటి నుంచే విక్రమ్‌కు నటనపై ఆసక్తి ఉంది. చదువుకునే రోజుల్లోనే నాటకాలపై దృష్టి పెట్టారు. తన పాఠశాలలో జరిగిన ప్రదర్శనలో ఓ బానిస అమ్మాయిలా నటించటంతో అందరూ విక్రమ్‌ను మెచ్చుకున్నారు. దీంతో ఆయనకు నటనపై మరింత ఆసక్తి పెరిగింది. కాలేజీలో ఓ నాటకంలో పాల్గొని బెస్ట్ యాక్టర్ అవార్డును గెలుచుకుని ఎంతో మంది ప్రశంసలు అందుకున్నారు. 12 ఏళ్ల వయసులో తన స్నేహితుడితో సరదాగా బైక్‌పై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. దీంతో విక్రమ్ కుడికాలికి తీవ్ర గాయమైంది. రోజులు గడుస్తున్నా గాయం నుంచి కోలుకోకపోవడంతో కాలిని తీసేస్తే మంచిదని వైద్యులు విక్రమ్ తల్లికి సలహా ఇచ్చారట. ఇది మాత్రమే కాదు, శరీరంపై ఎన్నో గాయాలయ్యాయి. కాలి లిగమెంట్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల ఎముకలు విరిగాయి. అయితే, విక్రమ్‌మాత్రం తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. క్రమంగా గాయం నుంచి కోలుకుని బయటపడ్డారు. ఈ క్రమంలో ఆయనకు దాదాపు 23 సర్జరీలు జరిగాయి. మూడేళ్ల పాటు వీల్ ఛైర్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని విక్రమ్ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు.
‘నేను నటుడిని కావాలనుకున్నాను. అదే నన్ను ముందుకు నడిపించింది’ అని విక్రమ్ అన్నారు. 1990లో విడుదలైన ఎన్ కాదల్ కన్మణి చిత్రం విక్రమ్‌కు మంచి పేరు తెచ్చినా, ఆ తర్వాత నటుడిగా నిలదొక్కుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిరాశ చెందని వ్యక్తిత్వమే విక్రమ్‌ను జాతీయ ఉత్తమ నటుడిగా నిలబెట్టింది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ కీలక పాత్రలో నటించిన ‘పొన్నియిన్ సెల్వన్2’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా పా.రంజిత్ దర్శకత్వంలో ‘తంగలాన్’లోనూ నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Avanigadda: మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా?: వారాహి యాత్రలో నిరుద్యోగుల ఆవేదన
-
ODI WC 2023: భారత స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులు జాగ్రత్త: పాక్ మాజీ కెప్టెన్
-
UGC NET 2023: యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల
-
Elections: అభ్యర్థుల నేర చరిత్రను.. పత్రికా ప్రకటనల్లో వెల్లడించాలి : ఎన్నికల సంఘం
-
World Culture Festival: ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం 180 దేశాల ప్రజల ప్రార్థన
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి