amir Khan: ధూమ్‌ యాక్షన్‌ వన్స్‌ ఎగైన్‌?

‘ధూమ్‌ 3’ సినిమాలో ఆమిర్‌ఖాన్‌ యాక్షన్‌ హంగామాను ప్రేక్షకులు మర్చిపోలేరు. తాజాగా ఈ సిరీస్‌లో మరో చిత్రం చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.

Updated : 07 Apr 2023 07:23 IST

‘ధూమ్‌ 3’ సినిమాలో ఆమిర్‌ఖాన్‌ యాక్షన్‌ హంగామాను ప్రేక్షకులు మర్చిపోలేరు. తాజాగా ఈ సిరీస్‌లో మరో చిత్రం చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఆయన ప్రధాన పాత్ర పోషించిన ‘లాల్‌ సింగ్‌ చద్ధా’ సినిమా బాక్సాఫీసు వద్ద పూర్తి స్థాయిలో నిరాశపరిచింది. ఈ సినిమా తరవాత చాలా రోజులు విరామం తీసుకున్న ఆయన యాక్షన్‌ చిత్రాలను చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ మంచి కంటెంట్‌ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నారు. ‘ధూమ్‌ 3’ సినిమాలోని సాహిర్‌, సమర్‌ పాత్రలను తిరిగి తీసుకురావడానికి ధూమ్‌ సిరీస్‌లో కొత్త చిత్రం కోసం ప్రముఖ యశ్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ సంస్థతో చర్చలు జరుపుతున్నారు ఆమిర్‌ ఖాన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని