Ashika ranganath: వరలక్ష్మీ.. ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తోందే!

‘నా సామిరంగ’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నృత్య దర్శకుడు విజయ్‌ బిన్నీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత.

Updated : 05 Dec 2023 09:30 IST

‘నా సామిరంగ’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నృత్య దర్శకుడు విజయ్‌ బిన్నీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఆషికా రంగనాథ్‌ కథానాయికగా నటిస్తోంది. ఆమె ఈ చిత్రంలో వరలక్ష్మి అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలియజేస్తూ చిత్ర బృందం సోమవారం ఫస్ట్‌లుక్‌, గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఆ ప్రచార చిత్రంలో ఆషికా లంగాఓణీలో అద్దం ముందు కూర్చొని అందంగా ముస్తాబవుతుంటే.. నాగార్జున బయట గోడ దగ్గర నుంచొని ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ రొమాంటిక్‌గా కనిపించారు. త్వరలోనే ఈ సినిమా నుంచి ‘‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తోందే’’ అనే పాటను విడుదల చేయనున్నట్లు ఈ గ్లింప్స్‌తోనే స్పష్టత ఇచ్చింది చిత్ర బృందం. ఇదొక భిన్నమైన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా చిత్రం. ఇందులో నాగ్‌ శక్తిమంతమైన మాస్‌ పాత్రలో కనిపించనున్నారు. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు