Chiranjeevi: ‘అబీబీ అబీబీ’ బీట్‌కు ఆ పాటే మూలం!
చిరంజీవి సినిమాల్లోని పాటల్లో కొన్ని గీతాలకు ప్రత్యేక స్టెప్లు వేశారు. అలాంటి వాటిలో ‘హిట్లర్’లో ‘నడక కలిసిన నవరాత్రి’ ఒకటి.
ఇంటర్నెట్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో అదిరిపోయే స్టెప్లతో అలరించే కథానాయకుడు ఎవరంటే మొదటగా గుర్తొచ్చే పేరు చిరంజీవి (Chiranjeevi). నేటి యువ కథానాయకుల జాబితాలో అలాంటి వారు చాలామందే ఉన్నారు. అయితే, చిరంజీవి సినిమాల్లోని పాటల్లో కొన్ని గీతాలకు ప్రత్యేక స్టెప్లు వేశారు. అలాంటి వాటిలో ‘హిట్లర్’లో (Hitler movie) ‘నడక కలిసిన నవరాత్రి’ ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రంభ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయిదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా చిరు నటన అందరినీ ఆకట్టుకుంది. ఇక కోటి సంగీత సారథ్యంలో పాటలన్నీ హిట్. ‘నడక కలిసిన నవరాత్రి’ పాటైతే (Nadaka Kalisina song) సూపర్ హిట్. ఎందుకంటే అందులో ‘అబీబీ.. అబీబీ..’ అంటూ సాగే ఈ పాటలో చిరు స్టెప్ ఎవర్గ్రీన్. దీనికి లారెన్స్ నృత్యాలు సమకూర్చారు.
ఈ పాటకు స్ఫూర్తిగా ‘దీదీ’ అనే ఒక అరబిక్ గీతాన్ని అనుకరించడం గమనార్హం. అరబిక్ గీతం ‘నడక’ను మాత్రమే అనుకరిస్తూ, ఆధునిక సంగీత రీతులకు అనుగుణంగా ఈ పాటకు సొబగులద్దడం గొప్పనే చెప్పుకోవాలి. ఈ అరబిక్ పాటను సొంతంగా రాసి ఆలపించిన ఆ అల్జీరియన్ గాయకుని పేరు ఖాలెద్. ‘లా ఝుర్ల మిమూయున్ ర్కూచ్ జైన్.. క్వీస్ ఇల్ షబ్క ఫిల్ భర్ విబ్కిఆల లిజర్ దీదీ.. దీదీ.. దీదీ’ అంటూ సాగే ఈ ‘దీదీ’ ఆల్బం మొదట 1991లో విడుదలైంది. ఫ్రెంచ్ సింగిల్స్ చార్టడ్లో తొమ్మిదో స్థానంలో నిలిచి బాగా జనరంజకమైంది. ఇరవై వారాల పాటు తొలి యాభై గొప్ప ఆల్బమ్‌లలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు స్విట్జర్లాండ్, బెల్జియం, ఈజిప్టు, సౌదీ అరేబియా దేశాల్లో సింగిల్ చార్టుల్లో ప్రథమస్థానం నిలుపుకొంది. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ పోటీల ప్రారంభోత్సవంలో ఖాలెద్ ‘దీదీ’ పాటను ఆలపించి జేజేలు అందుకున్నాడు. కోటి సంగీత సారథ్యంలో రూపొందించిన ఈ పాట తెలుగులోనూ ప్రేక్షకాభిమానం సొంతం చేసుకుంది. చిరు వేసిన స్టెప్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. ఆ తర్వాత ఆ స్థాయిలో చిరంజీవికి పేరు తెచ్చిన స్టెప్ ‘ఇంద్ర’లో వీణ స్టెప్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.4000తో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా: నాని
ఓ ఇంటర్వ్యూలో తన మొదటి జీతం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో నాని ‘Nani’ -
ఆ సినిమా సమయంలో విజయ్‌ని చూసి భయపడ్డా.. రష్మిక
గీత గోవిందం సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండను చూసి నిజంగా భయపడిన అంశాన్ని గుర్తు చేసుకున్నారు రష్మిక. -
‘ఇంద్ర’ను తెరకెక్కించేందుకు వెనకడుగేశారు కానీ: ఈ బ్లాక్ బస్టర్ మూవీ విశేషాలు తెలుసా?
చిరంజీవి హీరోగా బి. గోపాల్ తెరకెక్కించిన చిత్రం ‘ఇంద్ర’. ఈ సినిమా విడుదలై 22 ఏళ్లు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు.. -
‘మల్లీశ్వరి’లో డైనింగ్ టేబుల్ సీన్.. ఆసక్తికర విషయం పంచుకున్న కె.విజయ భాస్కర్
దర్శకుడు కె. విజయ భాస్కర్ ఇంటర్వ్యూలో తాను తీసిన మల్లీశ్వరి సినిమాలో ఆ సన్నివేశాలు ఎప్పటికీ మరచిపోలేనివి అంటూ గుర్తు చేసుకున్నారు. -
ఒకే రోజు .. రెండు సినిమాలు.. ఒకే దర్శకుడు..
ఒకే రోజున ఒక హీరో నటించిన రెండు చిత్రాలు విడుదలైతే అది వారి అభిమానులకు విశేషమైన పండగే. అలాగే ఒకే హీరోయిన్ రెండు సినిమాల్లో నటించి, ఆ రెండు చిత్రాలు ఒకేరోజున విడుదలైన సందర్భాలు ఉన్నాయి. -
‘ఎవడు వాడు.. మంచి ఛాన్స్ పోగొట్టాడు’
‘పుష్పవిమానం’ మూవీలో కథానాయిక ఎంపికకు సంబంధించి జరిగిన ఆసక్తికర విషయాన్ని సింగీతం శ్రీనివాసరావు ఓ సందర్భంలో పంచుకున్నారిలా.. -
ఆల్‌టైమ్ క్లాసిక్ ‘ఆదిత్య 369’కు 33 ఏళ్లు.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
ప్రస్తుతం ‘కల్కి’ చూసి భవిష్యత్‌లో ప్రపంచం ఇలా ఉంటుందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ, కొన్నేళ్ల కిందటే ప్రేక్షకుడిని భూత, భవిష్యత్తు కాలాల్లో ప్రయాణించిన అనుభూతి కలిగించిన చిత్రం ‘ఆదిత్య 369’. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ (జులై 18, 1991) విడుదలై 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. -
‘ఈ పాత్రకు ఎందుకు ఎంపిక చేశారండి’ అన్న వాణీవిశ్వనాథ్.. విడుదల తర్వాత స్టార్డమ్
ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ సందర్భంలో వాణీ విశ్వనాథ్ అన్న మాటలు గుర్తు చేసుకున్నారు. -
ట్రైలర్ షేర్ చేసి.. సినిమా ఆఫర్ అందుకుని: ‘మావీరన్’ అలా మొదలైంది
‘మావీరన్’ సినిమా విశేషాలు పంచుకున్నారు హీరో శివకార్తికేయన్. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
‘రోబో’లో మైఖేల్ జాక్సన్ పాట.. అలా మిస్సయింది!
‘రోబో’లో మైఖేల్ జాక్సన్‌తో పాట పాడించాలనుకున్న విషయాన్ని రెహమాన్ తాజాగా పంచుకున్నారు. -
రాజమౌళిని ఇబ్బంది పెట్టిన సుకుమార్ షాట్
సుకుమార్ తీసిన ‘1: నేనొక్కడినే’ మూవీలో ఓ షాట్ గురించి రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
‘బాహుబలి’ ఇంటర్వెల్.. ఆ డైలాగ్స్ వెర్షన్‌తో తెరకెక్కించి ఉంటే!
ప్రభాస్ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ చిత్రం గురించి పలు ఆసక్తికర విశేషాలివీ.. -
‘భారతీయుడు’ కోసం ఈ తెలుగు హీరోలను అనుకున్నారు కానీ..
కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘భారతీయుడు’ గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
‘ఒక్కడు’ మూవీకి తొలుత అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?
Okkadu movie: మహేశ్‌బాబు కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ తొలుత వేరే టైటిల్ అనుకున్నారు. -
ఆ అవమానం మరిచిపోలేని అక్కినేని..
నటుడిగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆయనకు ఎదురైన అవమానాలనే సోపానాలుగా చేసుకుని విజయం వైపు పయనించారు అక్కినేని -
హోటల్లో వెయిటర్‌గా నాజర్.. చిరంజీవికి విషయం తెలియడంతో..
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పూర్తయిన తర్వాత కొద్దిరోజులు అవకాశాలు రాకపోవడంతో హోటల్లో వెయిటర్‌గా పనిచేశారట సినీ నటుడు నాజర్.. ఆ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
‘రోబో’, ‘2.ఓ’ల్లో కమల్ హాసన్ అందుకే నటించలేదు.. కారణాలివే
‘భారతీయుడు 2’తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కమల్ హాసన్. ఈ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. ‘రోబో’, ‘2.ఓ’ల్లో తానెందుకు నటించలేదో వివరించారు. -
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
తానెందుకు సినిమాటిక్ యూనివర్స్‌లో చిత్రాలు తెరకెక్కించలేదన్న ప్రశ్నపై దర్శకుడు శంకర్ స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. -
అరవింద స్వామి మంచంపై.. రజనీ నేలపై..!
దళపతి సినిమా చిత్రీకరణ సందర్భంగా నేలపై పడుకున్న రజనీకాంత్‌ను చూసి అరవిందస్వామి షాకయ్యారు. -
కమల్ స్థానంలో మోహన్‌లాల్.. షారుక్ ప్లేస్‌లో అజయ్ దేవ్‌గణ్
తాను గతంలో తెరకెక్కించిన ఓ సినిమాకు సంబంధించి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. అదే సినిమా అంటే? -
ఆయనే ‘వైజయంతీ మూవీస్’ అని పేరు పెట్టారు
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘వైజయంతీ మూవీస్’ అసలు ఎలా ఏర్పాటైందో తెలుసుకుందామా!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం