Bhagavanth Kesari: గణేశ్‌ పాటతో శ్రీకారం

ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా బాక్సాఫీస్‌ ముందు దూకుడు చూపించారు కథానాయకుడు బాలకృష్ణ. ఇప్పుడీ దసరాకు ‘భగవంత్‌ కేసరి’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన.. కాజల్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి తెరకెక్కించారు.

Updated : 26 Aug 2023 14:02 IST

సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా బాక్సాఫీస్‌ ముందు దూకుడు చూపించారు కథానాయకుడు బాలకృష్ణ. ఇప్పుడీ దసరాకు ‘భగవంత్‌ కేసరి’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన.. కాజల్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి తెరకెక్కించారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబరు 19న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే పాటలతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్ధమైంది చిత్ర బృందం. ఇందులో భాగంగా సెప్టెంబరు 1న ఈ చిత్రం నుంచి ‘గణేశ్‌..’ పాటను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. అందులో బాలయ్య మాస్‌ లుక్‌లో హుషారుగా డ్రమ్స్‌ కొడుతూ కనిపించారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో సంభాషణలు పలకనున్నారు. ఆయన పాత్ర రెండు కోణాల్లో కనిపించనుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: సి.రామ్‌ప్రసాద్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని