Maanas: బిగ్‌బాస్‌ ఫేమ్‌ మానస్‌ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్‌

సీరియల్‌ నటుడు మానస్‌ (maanas) నిశ్చితార్థం వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 03 Sep 2023 01:44 IST

హైదరాబాద్‌: ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌, సీరియల్‌ నటుడు మానస్‌ (Maanas) త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. శ్రీజ నిశ్శంకరతో ఆయన నిశ్చితార్థం శనివారం వేడుకగా జరిగింది. నగరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఈ వేడుకలో బుల్లితెర తారలు సందడి చేశారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

బుల్లితెర వేదికగా ప్రసారమైన పలు ధారావాహికల్లో మానస్‌ నటించారు. 2021లో ప్రసారమైన ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 5’లో కంటిస్టెంట్‌గా ఆయన పాల్గొన్నారు. తన ఆట తీరుతో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సీరియల్స్‌లో నటిస్తూనే కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లో డ్యాన్స్‌లు చూస్తూ ఆకట్టుకుంటున్నారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని