Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్‌ ఛాన్స్‌’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?

ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ..

Published : 25 Mar 2024 11:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరోలు సూర్య (Suriya), కార్తి (Karthi) సోదరి బృందా శివకుమార్‌ (Brindha Sivakumar) కోలీవుడ్‌కు పరిచయమేగానీ టాలీవుడ్‌ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. గాయకురాలైన ఆమె తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘కన్నతిల్‌ ముత్తమిట్టల్‌’ (తెలుగులో అమృత)లోని హీరోయిన్‌ అవకాశం వచ్చిందని, నటనపై ఆసక్తి లేకపోవడంతో ఆ ఛాన్స్‌ వదులుకున్నానని తెలిపారు. మరోవైపు, పాఠశాల రోజుల్లోనే గాయనిగా.. సంగీత దర్శకుడు కార్తీక్‌ రాజా ఆఫర్‌ ఇస్తే తిరస్కరించానని చెప్పారు. 2018లో వచ్చిన ‘మిస్టర్‌ చంద్రమౌళి’ సినిమాతో బృందా సింగర్‌గా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమ్యారు. తర్వాత ‘జాక్‌పాట్‌’, ‘పొన్మంగళ్‌ వందళ్‌’, ‘ఓ2’ తదితర చిత్రాల్లో పలు పాటలు పాడారు. ‘బ్రహ్మాస్త్ర’ తమిళ్‌ వెర్షన్‌లో హీరోయిన్‌ (అలియా భట్‌) పాత్రకు బృందానే డబ్బింగ్‌ చెప్పారు.

మాధవన్‌ హీరోగా రూపొందిన చిత్రమే ‘కన్నతిల్‌ ముత్తమిట్టల్‌’ (Kannathil Muthamittal). బృందా నో చెప్పడంతో ఆ అవకాశం సిమ్రాన్‌కు దక్కింది. ఈ మ్యూజికల్‌ వార్‌ ఫిల్మ్‌ పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. జాతీయ పురస్కారాలుసహా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. 2002లో విడుదలైన ఈ మూవీతోనే ప్రముఖ సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి ప్రయాణం మొదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని