Devil: సరికొత్త అవతారంలో...

పంచ్‌ పవర్‌ ఇంత బలంగా ఉంటుందంటూ తన కొత్త సినిమాని ప్రత్యేక పోస్టర్‌తో ప్రకటించారు కల్యాణ్‌రామ్‌. ఆయనకి ఇది 21వ చిత్రం.

Updated : 06 Jul 2023 14:06 IST

పంచ్‌ పవర్‌ ఇంత బలంగా ఉంటుందంటూ తన కొత్త సినిమాని ప్రత్యేక పోస్టర్‌తో ప్రకటించారు కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram). ఆయనకి ఇది 21వ చిత్రం. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌తో కలిసి అశోక్‌ క్రియేషన్స్‌ పతాకంపై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పకులు. బుధవారం కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు. కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమా రూపొందుతోందని, ఆయన సరికొత్త యాక్షన్‌ అవతారంలో కనిపిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. విజయవంతమైన ‘అలా ఎలా?’ తర్వాత అశోక్‌ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం కల్యాణ్‌రామ్‌ ‘డెవిల్‌’ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత పట్టాలెక్కనున్న చిత్రం ఇదే.  త్వరలోనే నటీనటులు, సాంకేతిక బృందం వివరాల్ని వెల్లడించనున్నారు.

థ్రిల్లింగ్‌ ‘డెవిల్‌’

ల్యాణ్‌రామ్‌ నటిస్తున్న ‘డెవిల్‌’ ప్రచార చిత్రాన్ని బుధవారం విడుదల చేశారు. ‘స్వాతంత్య్రానికి పూర్వం ‘డెవిల్‌’ అనే ఓ బ్రిటిష్‌ ఏజెంట్‌ ఉండేవాడు...’ అంటూ కల్యాణ్‌రామ్‌ పాత్రని పరిచయం చేశారు. ఆయన సీక్రెట్‌ ఏజెంట్‌ పాత్రలో రహస్యాన్ని ఛేదించే పాత్రలో సందడి చేయనున్నారు. యాక్షన్‌, థ్రిల్లింగ్‌ అంశాల మేళవింపుగా ఈ సినిమా రూపొందుతోంది. కల్యాణ్‌రామ్‌ సరసన సంయుక్త మేనన్‌ నటించారు. నవీన్‌ మేడారం దర్శకత్వంలో అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. శ్రీకాంత్‌ విస్సా ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే సమకూర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు