Devil: పూర్తిగా నేను తీసిన చిత్రం... ‘డెవిల్‌’: నవీన్‌ మేడారం

‘‘ఎవరు ఎన్ని చెప్పినా ‘డెవిల్‌’ నేను దర్శకత్వం వహించిన సినిమా. అది నా బిడ్డతో సమానం’’ అన్నారు యువ దర్శకుడు నవీన్‌ మేడారం. నేను తీసిన సినిమాకి, దర్శకుడిగా నాకు గుర్తింపుని ఇవ్వకపోవడం ఎంతో బాధకి గురిచేసిందని సామాజిక మాధ్యమాల ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘డెవిల్‌’ మొదట నవీన్‌ మేడారం దర్శకత్వంలో పట్టాలెక్కింది.

Updated : 28 Dec 2023 09:45 IST

‘‘ఎవరు ఎన్ని చెప్పినా ‘డెవిల్‌’ నేను దర్శకత్వం వహించిన సినిమా. అది నా బిడ్డతో సమానం’’ అన్నారు యువ దర్శకుడు నవీన్‌ మేడారం. నేను తీసిన సినిమాకి, దర్శకుడిగా నాకు గుర్తింపుని ఇవ్వకపోవడం ఎంతో బాధకి గురిచేసిందని సామాజిక మాధ్యమాల ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘డెవిల్‌’ మొదట నవీన్‌ మేడారం దర్శకత్వంలో పట్టాలెక్కింది. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాణంతోపాటు, దర్శకత్వ బాధ్యతలూ తానే నిర్వర్తిస్తున్నట్టు అభిషేక్‌ నామా ప్రకటించారు. ఈ విషయం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. దీని గురించి నవీన్‌ మేడారం  సామాజిక మాధ్యమాల ద్వారా బుధవారం స్పందించారు. ‘‘ఇప్పటివరకూ నేను మౌనంగానే ఉన్నా. నా మౌనాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో నేనెలాంటి తప్పు చేయలేదు. అహంకారం, దురాశతో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగానే ఈ వివాదం మొదలైంది. ఈ చిత్రానికి ప్రాణం పోసేందుకు దాదాపు మూడేళ్లు శ్రమించా. ఈ ప్రయాణంలో కథానాయకుడు కల్యాణ్‌రామ్‌ సర్‌ నాకు అండగా నిలిచారు. ‘డెవిల్‌’ తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. మరింత నిబద్ధతతో తదుపరి ప్రయాణం కొనసాగిస్తా. కొత్త చిత్రానికి సంతకం చేశాం. ఆసక్తికరమైన స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నా’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ లేఖని పంచుకున్నారు నవీన్‌ మేడారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని