ఈ హీరోలు ఇలా చెబితే డేట్స్‌ ఇస్తారట!

అసలు ఎవరికి ఏం చెబితే కాల్షీట్స్‌ ఇస్తారో స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పారు. 

Published : 27 Feb 2024 12:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ఇండస్ట్రీలోని కథానాయకులందరూ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఒకప్పుడు అగ్ర కథానాయకుడి సినిమా అంటే కనీసం రెండేళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. అదే సమయంలో సినిమాపై ఒక్కో హీరోకు ఒక్కో భిన్నమైన ఆలోచన ఉంటుంది. హిట్‌ ఫార్ములాతో పాటు, తమ అభిరుచి మేరకు సినిమాలు చేస్తుంటారు. అసలు ఎవరికి ఏం చెబితే కాల్షీట్స్‌ ఇస్తారో స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పారు.

‘‘ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఓ జోక్‌ ఉంది. అది ఏంటంటే.. ఏ హీరోకి ఏ కబుర్లు చెబితే త్వరగా డేట్లు ఇచ్చేస్తారో ఇప్పుడు చెబుతా.. ‘ఈ సినిమాలో అన్నీ గన్సే విలన్‌ పెద్ద గన్‌ డీలర్‌.. ఇష్టమొచ్చినట్టు కాల్చేసుకోవచ్చు’ అని చెబితే పవన్‌కల్యాణ్‌ డేట్‌ ఇస్తారట.. ‘అసలు అవుట్‌ డోర్‌ అంటూ ఏమీ లేదండీ మొత్తం అంతా ఇండోర్‌ సెట్స్‌లోనే తీస్తున్నాం’ అని చెబితే ప్రభాస్‌ డేట్స్‌ ఇస్తారట.. ‘ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు కొట్టేద్దాం’ అని అంటే ‘కుమ్మేద్దాం భయ్యా’ అంటూ ఎన్టీఆర్‌ కాల్షీట్‌ ఇచ్చేస్తారట.. ‘ఇవాళ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తే 30 రోజుల్లో సినిమా అయిపోతుంది’ అని చెబితే రవితేజ డేట్స్‌ ఇస్తారట.. ‘రేపు సినిమా స్టార్ట్‌ అవుతుంది సర్‌. ఎప్పుడు ఫినిష్‌ అవుతుందో తెలియదు’ అని చెబితే మహేశ్‌ బాబు డేట్స్‌ ఇస్తారట. ఇది ఇండస్ట్రీలో టాక్‌. ఇది కేవలం ఒక జోక్‌ మాత్రమే’ అని పూరి ఓ ఫంక్షన్‌లో చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని