ustad: సిద్ధు ఉస్తాద్‌ ఆట..

అభిమానుల కోసం సినీతారలు ఆడే ఆట..‘ఉస్తాద్‌’. ర్యాంప్‌ ఆడిద్దాం అంటూ తెలుగు కథానాయకుడు మంచు మనోజ్‌ ఆ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 30 Dec 2023 18:40 IST

భిమానుల కోసం సినీతారలు ఆడే ఆట..‘ఉస్తాద్‌’. ర్యాంప్‌ ఆడిద్దాం అంటూ తెలుగు కథానాయకుడు మంచు మనోజ్‌ ఆ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘హాయ్‌ నాన్న’తో హిట్‌ కొట్టిన హీరో నానితో తొలి ఎపిసోడ్‌ విజయవంతంగా పూర్తైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను సొంతం చేసుకున్న ఈ సెలబ్రిటీ షో ఇప్పుడు ‘డీజే టిల్లు’కు ఆహ్వానం పలికింది. ‘డీజే టిల్లు’గా అభిమానుల్లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ రెండో ఎపిసోడ్‌కి రానున్నారు. గురువారం సాయంత్రం ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఆ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. అభిమాని కోసం సిద్ధు ఆడే ఉస్తాద్‌ ఆట ఎలా ఉంటుందో చూడాలి మరి!.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని