Rashmika: ఇంగ్లిషులో మాట్లాడాలని కోరిన అభిమానులు.. రష్మిక ఏమన్నారంటే!

రష్మికను ఇంగ్లిషులో మాట్లాడాలని కోరుతూ అభిమానులు పోస్ట్‌ పెట్టారు. దానిపై ఆమె స్పందించారు.

Published : 28 May 2024 21:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరోయిన్‌ రష్మిక (Rashmika Mandana) సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. వారి పోస్ట్‌లకు రిప్లై ఇస్తుంటారు. తాజాగా ఆమె ‘గం. గం.. గణేశా’ (Gam Gam Ganesha) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆ వేడుకలో ఆనంద్ దేవరకొండ అడిగిన ప్రశ్నలకు తెలుగులో సమాధానమిచ్చారు. దీనిపై రష్మిక దిల్లీ ఫ్యాన్స్‌ ఆమెను ఇంగ్లిషులో మాట్లాడాలని కోరుతూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. దానిపై ఆమె (Rashmika) స్పందించారు.

ఆ ఈవెంట్‌లో రష్మికకు సంబంధించిన ఫొటో షేర్‌ చేసిన ఫ్యాన్స్‌.. ‘మేము మిమ్మల్ని చూసి ఎంత ఆనందిస్తామో.. మీ మాటలు విని అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. మీకు అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. మీరు తెలుగులో మాట్లాడితే ఉత్తరాది వారికి అర్థం కాదు. అందుకే ఇకపై ఏ ఈవెంట్లోనైనా ఇంగ్లిషులోనే మాట్లాడడానికి ప్రయత్నించండి’ అని అడిగారు. దానికి రష్మిక స్పందిస్తూ.. ‘మీరు చెప్పింది నిజమే. ఇంగ్లిషులో మాట్లాడితే అందరూ అర్థం చేసుకుంటారు. కానీ, నేను వారి భాషలో మాట్లాడాలని చాలామంది కోరుకుంటారు. అలా మాట్లాడకపోతే నాకు ఆ భాష తెలియదని, దాన్ని గౌరవించట్లేదనుకుంటారు. అలా అనుకోవడం నాకు నచ్చదు. అయినా.. ఇకపై నా వంతు ప్రయత్నం చేస్తాను’ అని పేర్కొన్నారు.

ఆనంద్‌.. నువ్వు నా ఫ్యామిలీ.. ఇలా ఇరికిస్తే ఎలా?: రష్మిక

ప్రస్తుతం రష్మిక 5 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ సీక్వెల్ ‘పుష్ప2’లో  శ్రీవల్లిగా అలరించనున్నారు. ఇప్పటికే ఇందులోని టైటిల్‌సాంగ్‌ విడుదలై భారీ విజయాన్ని అందుకోగా.. త్వరలోనే మరో పాటను విడుదల చేయనున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. దీనితో పాటు ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’, ‘చావా’, ‘కుబేర’ సినిమాల్లోనూ రష్మిక నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని