Rashmika: ఆనంద్‌.. నువ్వు నా ఫ్యామిలీ.. ఇలా ఇరికిస్తే ఎలా?: రష్మిక

ఆనంద్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు ఉదయ్‌ బొమ్మిశెట్టి తెరకెక్కించిన ‘గం. గం.. గణేశా’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది.  

Updated : 28 May 2024 00:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా దర్శకుడు ఉదయ్‌ బొమ్మిశెట్టి తెరకెక్కించిన చిత్రం ‘గం. గం.. గణేశా’  (Gam Gam Ganesha). ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్లు. మే 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని సోమవారం నిర్వహించింది. ప్రముఖ నటి రష్మిక (Rashmika) ముఖ్య అతిథిగా హాజరై, సందడి చేశారు. సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఆనంద్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సరదాగా సమాధానాలిచ్చారు.

ఆనంద్‌:  మీకు బాగా ఇష్టమైన టూరిస్ట్‌ ప్లేస్‌?
రష్మిక: వియత్నాం 

ఆనంద్‌: మీతో కలిసి నటించిన హీరోల్లో మీ ఫేవరెట్‌?

రష్మిక: ఆనంద్‌.. నువ్వు నా ఫ్యామిలీ ఇలా ఇరికిస్తే ఎలా? అంటూనే రౌడీ బాయ్‌ (విజయ్‌ దేవరకొండ) అని తెలిపారు.

ఆనంద్‌: మా చిత్రంలో గణేశుడిది కీలక పాత్ర. ఆయన గురించి మీరేం చెబుతారు..

రష్మిక: నేను దేవుణ్ని నమ్ముతా. పూజలు ఎక్కువగా చేస్తుంటా. వినాయక చవితి ఎప్పుడూ ప్రత్యేకమే. 

ఆనంద్‌: మీ ఫ్రెండ్స్‌లో బెస్ట్‌ ఫొటోగ్రాఫర్‌ ఎవరు?

రష్మిక: నేనే. నీ ఫొటో కూడా తీశా. కానీ, ఎవరూ క్రెడిట్‌ ఇవ్వలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని