gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్‌మేనన్‌

సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 20 Mar 2024 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూర్య(Surya) ద్విపాత్రాభినయంలో నటించిన ఫీల్‌గుడ్‌ సినిమా ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’(Surya S/o Krishnan ). గౌతమ్‌ మేనన్‌(Gautham menon ) దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2008లో విడుదలై ప్రేక్షకుల ఆదరణ అందుకుంది. ఇందులో సిమ్రన్‌, సమీరారెడ్డి, దివ్యా శ్రీపాద కథానాయికలు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా హరీశ్‌ జయరాజ్‌ కంపోజ్‌ చేసిన పాటలు యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. 15 ఏళ్ల తర్వాత గత ఏడాది సూర్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్‌ అయి మంచి స్పందన అందుకుంది. ఇటీవల ఓ షోలో దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘సూర్య కెరియర్‌లో ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో కీలక పాత్రల్లో నేను అనుకున్న నటీనటులు భాగం కాలేకపోయారు. ఇందులో తండ్రి పాత్రకు మోహన్‌లాల్‌ లేదా నానా పటేకర్‌ను తీసుకోవాలని అనుకున్నా. ఎందుకంటే తండ్రీ తనయులుగా ఒకరే నటించాలన్న అభిప్రాయం మొదట్లో లేదు. కానీ సూర్య నన్ను అందుకు ఒప్పించారు. నా అభిప్రాయన్ని మార్చి ఆయనే తండ్రి పాత్రను పోషించారు. దీంతోపాటు మేఘన పాత్ర కోసం బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణెను సంప్రదించాం. అప్పటికి ఆమె ‘ఓంశాంతిఓం’ సినిమా చేస్తుండటంతో ఆ స్థానంలోకి సమీరా వచ్చారు. అప్పటివరకూ చేయని భిన్నమైన పాత్రను సమీరా పోషించారు. సూర్య తల్లిగా సిమ్రన్‌ నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని