Viswambhara: ఒక్క పోరాటం 26 రోజులు

అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్‌లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు.

Updated : 23 Apr 2024 09:42 IST

గ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్‌లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమాలోనూ విరామానికి ముందు వచ్చే ఓ పోరాట ఘట్టానికి ఎంతో ప్రత్యేకత ఉంది. భారతీయ సినిమాల్లో ఇప్పటివరకూ చూడని విధంగా ఆ పోరాట ఘట్టాన్ని 26 రోజులు చిత్రీకరించినట్టు సినీ వర్గాలు తెలిపాయి. యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు రామ్‌ - లక్ష్మణ్‌ నేతృత్వంలో చిరంజీవి, పలువురు ఫైటర్లపై ఈ సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ పోరాట ఘట్టం కోసమే ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఎ.ఎస్‌.ప్రకాశ్‌ నేతృత్వంలో 54 అడుగుల ఎత్తున్న హనుమాన్‌ విగ్రహంతోపాటు, ఓ ప్రత్యేకమైన సెట్‌ని తీర్చిదిద్దారు. ‘‘ఒక్క పోరాట ఘట్టం కోసం 26 రోజులు కేటాయించడం చిరంజీవి కెరీర్‌లో ఇదే ప్రథమం. ఎంతో ప్రత్యేకతతో కూడిన ఈ సన్నివేశాల చిత్రీకరణ  సోమవారంతో పూర్తయింది. ఇవి ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తాయ’’ని సినీ వర్గాలు తెలిపాయి. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫాంటసీ ప్రపంచం చుట్టూ సాగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని