Naga chaitanya: మరోసారి ఈ జోడీ?

నాగచైతన్య -  పూజా హెగ్డే జోడీ మరోసారి తెరపై సందడి చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ‘తండేల్‌’ సినిమా చేస్తున్న చైతూ... తదుపరి కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

Updated : 30 Apr 2024 09:39 IST

నాగచైతన్య -  పూజా హెగ్డే జోడీ మరోసారి తెరపై సందడి చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ‘తండేల్‌’ సినిమా చేస్తున్న చైతూ... తదుపరి కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అందులో కథానాయికగా పూజాహెగ్డేని ఎంచుకునేందుకు చిత్రబృందం  ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ‘విరూపాక్ష’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కార్తీక్‌ దండు... చైతన్య కోసం  మరో విభిన్నమైన థ్రిల్లర్‌ కథని సిద్ధం చేశారు. ఈ యేడాది సెప్టెంబర్‌లో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అందులో భాగంగానే కథానాయిక ఎంపికపై దృష్టి పెట్టింది చిత్రబృందం. ఇదివరకు  ‘ఒక లైలాకోసం’ సినిమాలో కలిసి నటించారు చైతూ, పూజా. అన్నీ కుదిరితే మరోసారి ఈ జోడీ తెరపై సందడి చేయడం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని