sri krishna pandaveeyam movie: క్రమశిక్షణలో ఎన్టీఆర్‌ కాఠిన్యం!

షూటింగ్‌ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్‌.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్‌కు రాలేదు.

Published : 22 Apr 2024 13:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చేసే పనిని దైవంగా భావించి, అందరికీ ఆదర్శంగా నిలిచిన మహా నటుడు నందమూరి తారక రామారావు. పనిపట్ల ఆయనకు ఉండే అంకితభావం చాలా తక్కువ మందికి ఉంటుందంటే ఆశ్చర్యం లేదు. ఉదయం 6గంటలకు షూటింగ్‌ అంటే, 5.45గంటలకే మేకప్‌ వేసుకుని మరీ వచ్చే నటుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. క్రమశిక్షణ, సమయపాలనలో ఆయనను చూసి ప్రతి నటుడు భయపడాల్సిందే.

1966లో ఎన్టీఆర్‌ ‘శ్రీకృష్ణ పాండవీయం’ తీశారు. ఆయనే దర్శకుడు. కె.ఆర్‌.విజయ నాయిక. ఆమె అప్పుడప్పుడే తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. షూటింగ్‌ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్‌.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్‌కు రాలేదు. దాంతో ఎన్‌.టి.ఆర్‌. అగ్గిపిడుగు అయిపోయారు. క్రమశిక్షణ, నిష్ఠ పాటించే ఆయన సహించలేక, ఆమె వల్ల తనకి ఇంత నష్టం కలిగిందని, ఇది చెల్లించకపోతే తన చిత్రం నుంచి తీసేస్తానని, అప్పుడు మరింత నష్టం కలుగుతుందనీ కోర్టుకి వెళ్లారు. ఎన్టీఆర్‌ కఠినమైన క్రమశిక్షణ సంగతి తెలియని విజయ, దెబ్బకి దిగివచ్చారు. వెంటనే రాజీపడి, తన వల్ల కలిగిన నష్టాన్ని చెల్లించి, అపరాధానికి క్షమాపణ కోరి సినిమాలో కొనసాగారు. అప్పటి నుంచి ఆమె ఒక్కసారి కూడా సెట్టుకు ఆలస్యంగా రాలేదు.. ఏనాడూ మళ్లీ షూటింగ్‌ మానలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని