‘మీర్జాపూర్‌’లోకి సోనాల్‌ చౌహాన్‌

Eenadu icon
By Cinema Desk Published : 28 Oct 2025 01:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

‘లెజెండ్‌’, ‘పండగ చేస్కో’, ‘సైజ్‌ జీరో’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది సోనాల్‌ చౌహాన్‌. తాజాగా ఆమె ‘మీర్జాపూర్‌: ది ఫిల్మ్‌’ చిత్రంలో భాగమైనట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది చిత్రబృందం. ‘‘అద్భుతమైన ఆటను మార్చే ప్రయాణంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ‘మీర్జాపూర్‌: ది ఫిల్మ్‌’లో చేరడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. నన్ను మీర్జాపూర్‌ ప్రపంచంలోకి తీసుకువచ్చినందుకు దర్శకుడికి, నిర్మాతలకి ధన్యవాదాలు’’ అనే వ్యాఖ్యని జోడించింది సోనాల్‌. గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వంలో ఫర్హాన్‌ అక్తర్, రితేశ్‌ సిధ్వానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, శ్వేతా త్రిపాఠి నటించిన మీర్జాపూర్‌ ఫ్రాంచైజీ మూడు సీజన్లలో చాలామంది అభిమానుల్ని సంపాదించుకుంది. దర్శకుడు గుర్మీత్‌ సింగ్‌ ఇప్పుడీ హిట్‌ వెబ్‌సిరీస్‌ని సినిమాగా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో పాత తారాగణంతో పాటు కొత్తగా జితేంద్ర కుమార్, రవి కిషన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మీర్జాపూర్‌ ప్రాంతంలో అధికార పోరాటాలు, నేరస్థుల అండర్‌ వరల్డ్‌ కథకు కొనసాగింపుగా ఈ సినిమా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు