Team india: హర్మన్‌ ప్రీత్‌.. అమన్‌జ్యోత్‌కు పీసీఏ ఎంత రివార్డ్‌ ప్రకటించిందంటే..!

Eenadu icon
By Sports News Team Published : 04 Nov 2025 13:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) మహిళల వన్డే ప్రపంచకప్‌ (ICC Womens World Cup) గెలవడంలో కీలకపాత్ర పోషించిన తమ రాష్ట్ర క్రికెటర్లైన హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, అమన్‌జ్యోత్‌ కౌర్‌లకు పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (PCA) రూ.11 లక్షలు చొప్పున నగదు రివార్డ్‌ను ప్రకటించింది. అలాగే జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ మునీష్‌ బాలికి రూ.5 లక్షల రివార్డ్‌ ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని వారికి త్వరలోనే అందించనున్నట్లు తెలిపింది. 

పీసీఏ అధ్యక్షుడు అమర్‌జిత్ సింగ్ మెహతా, గౌరవ కార్యదర్శి సిద్ధాంత్ శర్మ.. టీమ్‌ఇండియా విజయంలో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, అమన్‌జ్యోత్‌ కౌర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ మునీష్‌ బాలి పాత్రను ప్రశంసించారు. వారి ప్రదర్శన పంజాబ్‌కు మాత్రమే కాకుండా యావత్‌ భారత్‌కు గర్వకారణమని కొనియాడారు. ‘ఈ ప్రపంచ కప్ విజయం భారతదేశానికి గర్వకారణం. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారిలో పంజాబ్‌కు చెందిన వారుండటం ఆనందదాయకం. వారి అంకితభావం, ప్రదర్శన మన రాష్ట్రానికే కాకుండా, భారత క్రికెట్‌కూ గొప్ప కీర్తిని తెచ్చిపెట్టాయి.’ అని అన్నారు. 

టీమ్‌ఇండియా కెప్టెన్‌గా వ్యహరిస్తున్న హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ స్వస్థలం పంజాబ్‌లోని మోగా. ఆమె సారథ్యంలోనే టీమ్‌ఇండియా తొలిసారిగా వన్డే వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకుంది. అటు బ్యాటర్‌గానూ, ఇటు కెప్టెన్‌గా రాణించింది. ముఖ్యంగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ చేతికి బంతిని అందించి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. షెఫాలీ సైతం తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. వరుస ఓవర్లలో రెండు వికెట్లను కూల్చి.. మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పడంలో సాయపడింది. స్లో బంతులు సంధించి ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించింది. వారు స్వేచ్ఛగా పరుగులు చేయకుండా కట్టడి చేసింది. అలాగే మొహాలికి చెందిన అమన్‌జ్యోత్‌ కౌర్‌ సైతం తన ఆల్‌రౌండ్‌ ప్రతిభతో టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలవడంలో తనవంతు పాత్రను పోషించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు