Etv win: ఈటీవీ విన్‌లో సోమవారం కథ

‘హవ్‌ ఈజ్‌ దట్‌ ఫర్‌ ఎ మండే’...శ్రీపాల్‌ సామ దర్శకత్వం వహించిన థ్రిల్లర్‌ సినిమా. కౌశిక్‌ ఘంటసాల, సబ్రినా, మేఘన్‌ ప్రధాన పాత్రలో తెలుగు-ఇంగ్లిష్‌ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని రాధిక శ్రీనివాస్‌ నిర్మించారు.

Updated : 08 Dec 2023 09:32 IST

‘హవ్‌ ఈజ్‌ దట్‌ ఫర్‌ ఎ మండే’...శ్రీపాల్‌ సామ దర్శకత్వం వహించిన థ్రిల్లర్‌ సినిమా. కౌశిక్‌ ఘంటసాల, సబ్రినా, మేఘన్‌ ప్రధాన పాత్రలో తెలుగు-ఇంగ్లిష్‌ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని రాధిక శ్రీనివాస్‌ నిర్మించారు. సోమవారం జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, ఒక బిలియనీర్‌, కొంతమంది దొంగల ముఠా జీవితంలో జరిగే మార్పులను అద్భుతమైన కథనంతో సినిమా రూపొందింది. ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలతో ఇటీవల విడుదలైన ఈ సినిమా ఐఎమ్‌డీబీలో మంచి రేటింగ్స్‌ సాధించింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో గురువారం నుంచి ప్రసారం అవుతుందని చిత్రబృందం తెలిపింది. థ్రిల్లర్‌ జానర్‌ని ఇష్టపడే అభిమానులకు ఈ చిత్రం తప్పక నచ్చుతుందని అన్నాయి సినీ వర్గాలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని