Ileana: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా!?

నటి ఇలియానా (Ileana) తల్లి అయ్యారు. ఈ మేరకు చిన్నారి ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

Published : 06 Aug 2023 02:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి ఇలియానా (Ileana) తల్లి అయ్యారు. ఆగస్టు 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు చిన్నారి ఫొటోను షేర్‌ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్ డోలన్‌’ని పరిచయం చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత సంతోషిస్తున్నామో మాటల్లో చెప్పలేం అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ చూసిన పలువురు నెటిజన్లు, ప్రముఖులు ఇలియానాకు అభినందనలు చెబుతున్నారు.

తాను తల్లి కానున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇలియానా ప్రకటించింది. గత నెల జులైలో ప్రియుడి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అయితే ఇలియానా అతడి పేరును మాత్రం చెప్పకపోవడం గమనార్హం. ఇక ‘దేవదాస్‌’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇలియానా.. గతకొంతకాలంగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉంటోంది. ఈ అమ్మడు తెలుగు తెరపై చివరిసారి 2018లో కనిపించింది. రవితేజ హీరోగా నటించిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ లో అలరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని