Mohan Babu: మోహన్‌బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు

నేడు మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. 

Updated : 19 Mar 2024 09:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంటాయి. ఇలాంటి వాటిలో ప్రముఖ హీరో మోహన్‌ బాబు (Mohan Babu) పోషించిన విష్ణు పాత్ర ఒకటి. ఈ రోల్‌ ప్లే చేసిన ఆ హిట్‌ చిత్రం మరేదోకాదు ‘అల్లుడుగారు’ (Alludugaru). నేడు మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా సంగతులు చూద్దాం..

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (1990) విజయంతో దర్శకుడు రాఘవేంద్రరావు క్రేజ్‌ రెట్టింపయ్యింది. దీంతో, ఆయన తదుపరి ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ‘అల్లుడుగారు’ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలో.. ‘సూపర్‌హిట్ తర్వాత చేస్తున్న చిత్రమిది. అందుకే పెద్ద హీరోని తీసుకోండి. ఎందుకు మోహన్‌బాబుతో తీస్తున్నారు?’ అని రాఘవేంద్రరావుతో కొందరు అన్నారట. వారి మాటలను పట్టించుకోకుండా రాఘవేంద్రరావు తనతో ఆ చిత్రాన్ని తెరకెక్కించారని మోహన్‌బాబు ఓ సందర్భంలో నాటి సంగతులు గుర్తుచేసుకున్నారు. 32 రోజుల్లో చిత్రీకరణ పూర్తయిందని తెలిపారు. శోభన, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 1990 సెప్టెంబరు 28న విడుదలైంది. ఈ చిత్రం పలు థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ‘ముద్దబంతి నవ్వులో’, ‘కొండమీద చుక్కపోటు’.. ఇలా ఇందులోని పాటలన్నీ ఇప్పటికీ మార్మోగుతూనే ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని