Kalyan ram: డ్యాన్స్‌ కొత్తగా.. కొంచెం మత్తుగా

‘డెవిల్‌’గా సినీప్రియుల్ని థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు కల్యాణ్‌ రామ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంయుక్త కథానాయిక.

Updated : 28 Nov 2023 09:28 IST

‘డెవిల్‌’గా సినీప్రియుల్ని థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు కల్యాణ్‌ రామ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంయుక్త కథానాయిక. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం నుంచి రెండో గీతాన్ని విడుదల చేశారు. కల్యాణ్‌ రామ్‌, ఎల్నాజ్‌లపై చిత్రీకరించిన ప్రత్యేక గీతమిది. ‘‘డ్యాన్స్‌ డ్యాన్స్‌ మళ్లీ కొత్తగా.. డ్యాన్స్‌ డ్యాన్స్‌ కొంచెం మత్తుగా.. డ్యాన్స్‌ డ్యాన్స్‌ దిస్‌ ఈజ్‌ లేడీ రోజీ’’ అంటూ హుషారుగా సాగుతున్న ఈ పాటకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్వరాలు సమకూర్చారు. శ్రీహర్ష ఇమాని సాహిత్యమందించగా.. రాజకుమారి ఆలపించారు. ‘‘స్వాతంత్య్రానికి పూర్వం మద్రాస్‌ ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందిన స్పై థ్రిల్లర్‌ ఇది. ఇందులో కల్యాణ్‌రామ్‌ బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపించనున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్‌ విస్సా, ఛాయాగ్రహణం: సౌందర్‌ రాజన్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని