Katrina kaif: మరియా పాత్ర నాకెంతో నేర్పింది

‘టైగర్‌ 3’లోని జోయా పాత్ర తర్వాత నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి అవకాశం కల్పించింది మరియా పాత్రనే’ అంటోంది బాలీవుడ్‌ అగ్ర కథానాయిక కత్రినా కైఫ్‌.

Updated : 19 Jan 2024 09:32 IST

‘టైగర్‌ 3’లోని జోయా పాత్ర తర్వాత నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి అవకాశం కల్పించింది మరియా పాత్రనే’ అంటోంది బాలీవుడ్‌ అగ్ర కథానాయిక కత్రినా కైఫ్‌. ఆమె, విజయ్‌ సేతుపతితో కలిసి మరియాగా నటించిన చిత్రమే ‘మెరీ క్రిస్మస్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సానుకూల స్పందన సొంతం చేసుకుంటోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కత్రిన... ‘ఇందులో మరియాది ఒక భిన్నమైన ప్రపంచం. నటనకు ఎంతో అవకాశముంది. చిత్రీకరణ ప్రారంభమయ్యే ముందే ఈ సినిమా, పాత్ర గురించి దర్శకుడు శ్రీరామ్‌తో దాదాపు ఏడాదిన్నరపాటు చర్చలు జరిపాను. కథ చెప్పడం పూర్తవగానే ‘మరియా ఎవరు? తన వెనకున్న కథేంటి? ఆమె జీవితంలో ఏం జరిగింది?’ అని భిన్న కోణాల్లో ఆలోచించమని చెప్పారు. అలా చేయడం నాకెంతో మేలు చేసింది. నేను సమర్థంగా నటించి, నన్ను నేను కొత్తగా నిరూపించుకోవడానికి దోహదపడింది’ అంటూ చెప్పుకొచ్చింది కత్రిన.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని