Saindhav: సైంధవ్‌ సై

‘హిట్‌’ అంటూ మెగాఫోన్‌ చేతపట్టి.. ఆ పేరుకి తగ్గట్టే విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు శైలేశ్‌ కొలను. హిట్‌.. ఫస్ట్‌ కేస్‌, సెకండ్‌ కేస్‌ అంటూ ఫ్రాంచైజీగా చేసిన రెండు చిత్రాలతోనూ ప్రేక్షకుల్ని మెప్పించాడు.

Updated : 24 Dec 2023 10:37 IST

‘హిట్‌’ అంటూ మెగాఫోన్‌ చేతపట్టి.. ఆ పేరుకి తగ్గట్టే విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు శైలేశ్‌ కొలను. హిట్‌.. ఫస్ట్‌ కేస్‌, సెకండ్‌ కేస్‌ అంటూ ఫ్రాంచైజీగా చేసిన రెండు చిత్రాలతోనూ ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఆ ప్రతిభే ఆయనకి వెంకటేశ్‌తో ‘సైంధవ్‌’ చేసే అవకాశం తెచ్చిపెట్టింది. అగ్ర కథానాయకుడి సినిమా.. అందులోనూ ఆయన కెరీర్‌లో మైలురాయిలాంటి 75వ చిత్రం అన్నప్పుడు ఎన్ని లెక్కలొస్తాయనీ? అభిమానులు, అంచనాలు, కథానాయకుడి ఇమేజ్‌... ఇలా చాలానే ఆలోచించాల్సి వుంటుంది. అయినా సరే, వాటిని చూసి భయపడకుండా, లెక్క మారుస్తానంటూ ఆత్మవిశ్వాసంతో రంగంలోకి దిగాడు యువ దర్శకుడు శైలేశ్‌ కొలను. కెప్టెన్‌ ఎంత ధైర్యంగా ఉంటే హీరోలు, హీరోయిన్లు అంత హుషారుగా నటిస్తారు. ‘సైంధవ్‌’ సెట్లో కథానాయకుడు వెంకటేశ్‌, దర్శకుడు శైలేశ్‌ కొలను మధ్య ఎంత హుషారైన వాతావరణం ఉందో ఈ చిత్రం చాటుతోంది. ‘సైంధవ్‌’ ప్రచార చిత్రాలు, పాటలతో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు. సంక్రాంతి బరిలో దిగేందుకు తాము సై అంటూ విడుదల తేదీనీ ఎప్పుడో ఖరారు చేసింది చిత్ర బృందం. జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు