Baahubali: The Epic: ‘బాహుబలి’ రీ రిలీజ్‌.. రివ్యూ ఇచ్చిన మహేశ్‌బాబు కుమారుడు గౌతమ్‌

Eenadu icon
By Entertainment Team Published : 30 Oct 2025 10:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్: పాన్‌ ఇండియా స్థాయి సినిమాలకు పునాది వేసిన చిత్రం ‘బాహుబలి’. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఈ ఎపిక్‌ ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకురానుంది. రెండు భాగాలు కలిపి ఒకే భాగంగా ‘బాహుబలి: ది ఎపిక్‌’ (Baahubali: The Epic) పేరుతో అక్టోబర్‌ 31న రీ రిలీజ్‌ కానుంది. విదేశాల్లో ఒకరోజు ముందుగానే సందడి చేస్తోంది. తాజాగా ఓవర్సీస్‌లో ఈ సినిమా చూసిన మహేశ్‌బాబు కుమారుడు గౌతమ్‌ (Gautham Ghattamaneni) దీనిపై ప్రశంసలు కురిపించారు.

‘‘ప్రపంచంలోనే అతి పెద్ద థియేటర్‌లో ‘బాహుబలి: ది ఎపిక్‌’ని చూడడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడో తెలుసుకోవడం కోసం ఇప్పుడు రెండేళ్లు వేచిచూడాల్సిన అవసరం లేదు. ఎడిట్‌ చేసిన తర్వాత ఈ చిత్రం మరింత అద్భుతంగా ఉంది (Baahubal Rerelease). తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా ఇంత ఆదరణ దక్కడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఈ రెండు భాగాలను ఒకేసారి చూడడం కొత్తగా ఉంది. నిజంగానే ఇది ఎపిక్‌ సినిమా. ప్రతి సెకనుకు గూస్‌బంప్స్‌ వస్తున్నాయి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. అంత అద్భుతంగా ఉంది. క్రేజీ ఫీలింగ్‌’’ అని తెలిపారు. ఇక మహేశ్‌ బాబు హీరోగా రాజమౌళి (S.S Rajamouli) తెరకెక్కించనున్న సినిమా (SSMB 29) గురించి తనను అడగవద్దని గౌతమ్‌ తెలిపారు. తనకేం తెలియదని సరదాగా చెప్పారు. 

‘బాహుబలి’ రీ రిలీజ్ సందర్భంగా సోషల్‌ మీడియాలో సందడి నెలకొంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్‌లో జోరు చూపిస్తోంది. రెండు భాగాలు కలిపి విడుదల చేసిన నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు తొలగించినట్లు రాజమౌళి తెలిపారు. ‘బాహుబలి: ది ఎపిక్‌’ రన్‌టైమ్‌ 3:45 గంటలు అని చెప్పిన ఆయన.. అవంతిక లవ్‌స్టోరీ, పచ్చబొట్టేసిన పాట, ఇరుక్కుపో సాంగ్‌, కన్నా నిదురించరా సాంగ్‌, యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు