Nagarjuna: శరవేగంగా నా సామిరంగ

సంక్రాంతి బరిలో దిగడమే లక్ష్యంగా ‘నా సామిరంగ’ను పరుగులు పెట్టిస్తున్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నృత్య దర్శకుడు విజయ్‌ బిన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 02 Dec 2023 09:37 IST

సంక్రాంతి బరిలో దిగడమే లక్ష్యంగా ‘నా సామిరంగ’ను పరుగులు పెట్టిస్తున్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నృత్య దర్శకుడు విజయ్‌ బిన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ మైసూర్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఇప్పటికే పాటలు చిత్రీకరించగా.. ఇప్పుడు కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రీకరణను పూర్తి చేసి.. పాటలతో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగానే నిర్మాణానంతర పనుల్ని పరుగులు పెట్టిస్తున్నట్లు తెలిసింది. పీరియాడిక్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగార్జున మునుపెన్నడూ చూడని మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. దీంట్లో ఆషికా రంగనాథ్‌ కథానాయికగా కనిపించనుండగా.. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు