Varun Tej: రామోజీ ఫిల్మ్‌సిటీలో మట్కా చిత్రీకరణ

Eenadu icon
By Cinema Desk Updated : 27 Jun 2024 00:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

థార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం... ‘మట్కా’. వరుణ్‌తేజ్‌ కథా  నాయకుడిగా నటిస్తుండగా... కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయికలు. డా.విజేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. పాత విశాఖపట్నం నగరాన్ని ప్రతిబింబించే ప్రత్యేకమైన సెట్స్‌ని రూ.15 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దుతున్నారు. అందులోనే 35 రోజులపాటు కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ‘‘దేశాన్ని కదిలించిన సంఘటనల్ని ఆధారంగా చేసుకుని కరుణ కుమార్‌ ఈ కథని రాశారు. కేవలం వినోదం పంచడమే కాకుండా... భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయేలా, ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని పంచేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. పాత విశాఖని పునః సృష్టించిన తీరు, నిర్మాణ హంగులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వరుణ్‌ తేజ్‌ ఓ మరపురాని పాత్రకి జీవం పోస్తున్నారు. ఆయన కెరీర్‌లో ఓ మైలురాయిలాంటి సినిమా అవుతుంద’’ని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నవీన్‌చంద్ర, అజయ్‌ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి.రవిశంకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌ కుమార్, ఛాయాగ్రహణం: కిశోర్‌ కుమార్, కూర్పు: కార్తీక శ్రీనివాస్‌.ఆర్‌.

Tags :
Published : 27 Jun 2024 00:46 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని