98 కేజీలు తగ్గిన కొరియోగ్రాఫర్..!
బాలీవుడ్లో సినిమా తారలంతా బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే కాలంలో నటుడు ఫరీద్ ఖాన్ ఆరు నెలల్లో 18 కిలోలు తగ్గి ఆశ్చర్యానికి గురి చేశారు. మళ్లీ సినిమాల్లో నటించనున్నట్లు.
ముంబయి: బాలీవుడ్లో సినిమా తారలంతా బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే కాలంలో నటుడు ఫరీద్ ఖాన్ ఆరు నెలల్లో 18 కిలోలు తగ్గి ఆశ్చర్యానికి గురి చేశారు. మళ్లీ సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘కపిల్ శర్మ షో’కు సంబంధించిన ప్రోమోలో బాలీవుడ్ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య 98 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 200 కిలోల బరువున్న తాను కొన్ని నెలల పాటు వర్కౌట్లు చేసినట్లు ఈ సందర్భంగా గణేశ్ ఆచార్య చెప్పారు. వ్యాయామం విషయంలో ఎంత కఠినంగా ఉండేవారనేది ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేసిన వీడియోలు చూస్తే తెలుస్తుంది.
బరువు విషయంలో గణేశ్ ఆచార్య కొన్నేళ్లుగా కృషి చేస్తున్నారు. ఇదే విషయమై 2017లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇది నాకు చాలా కఠినమైనది. ఏడాదిన్నర నుంచి నా బరువు తగ్గించుకోవటానికి కష్టపడుతున్నా. 2015లో నేను నటించిన ‘హే బ్రో’ చిత్రం కోసం 30-40 కిలోలు తగ్గాను’ అని తెలిపారు. రణ్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, గోవింద, అజయ్ దేవగణ్ నటించిన పలు చిత్రాలకు గణేశ్ ఆచార్య కొరియోగ్రాఫర్‌గా వ్యహరించారు. తాజాగా సింబా, పద్మావత్, జీరో చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. 2018లో ‘టాయ్‌లెట్’ చిత్రంలోని ‘గోరీ తూ లాత్ మార్’ పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
త్రిగుణ్ కీలక పాత్రలో నటించిన ‘లైన్ మ్యాన్’ మూవీ ప్రస్తుతం తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
baak movie review: ‘అరణ్మనై’ సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన ‘బాక్’మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా? -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
aa okkati adakku review: అల్లరి నరేష్, ఫరియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాధవన్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన ‘షైతాన్’ ఓటీటీలోకి రానుంది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
సెట్లోకి అప్పుడే!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన తదుపరి సినిమా మహేశ్‌బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. -
లెక్కలు సరిచేసే రక్షకుడు
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పట్టాలెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉంది. -
‘కుబేర’లో నాగ్ ఇలా!
నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కుబేర’. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్‌రావు నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రంలో నాగార్జునకు సంబంధించిన ఫస్ట్‌లుక్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. -
మండు వేసవిలో హాయిగా నవ్వించే చిత్రం
‘‘పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాల్ని అందరికీ తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు అల్లరి నరేశ్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు. -
‘హౌస్‌ఫుల్ 5’.. ‘జాలీ ఎల్ఎల్బీ 3’
‘బడేమియా ఛోటేమియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’. -
ప్రభుదేవా షూటింగ్ షురూ
‘ముక్కాల ముక్కాబులా..’ ఇప్పటికీ సినీప్రేమికుల్ని అలరిస్తున్న గీతమిది. ఇందులో ప్రభుదేవా డ్యాన్స్, ఏఆర్. రెహమాన్ సంగీతం అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ‘ఏఆర్ఆర్పీడీ6(వర్కింగ్ టైటిల్)’ అనే సినిమా రూపొందుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. -
రిపబ్లిక్ డేకి ‘లాహోర్ 1947’?
ప్రత్యేకమైన రోజున వారి చిత్రాల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఇప్పుడదే పనిలో బిజీగా ఉంది ‘లాహోర్: 1947’ చిత్రబృందం. -
ఈటీవీ విన్లో ప్రణయ విలాసం
‘ప్రేమలు’ సినిమాలో తన నటనతో సినీప్రియులను మెప్పించింది మలయాళ కథానాయిక మమితా బైజు. ఆమె, అర్జున్ అశోకన్ జంటగా నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. నిఖిల్ మురళి తెరకెక్కించారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్‌కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు