Salaar ott release: ఓటీటీలో ప్రభాస్‌ ‘సలార్‌’ వచ్చేసింది

ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్’ (Salaar) ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Updated : 20 Jan 2024 16:01 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్’ (Salaar). క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమేకాకుండా, బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఎంతోకాలంగా హిట్‌ కోసం వేచి చూసిన ప్రభాస్‌ (Prabhas), ఆయన అభిమానులకు 2023లో తీపి జ్ఞాపకాన్ని అందించింది. ప్రభాస్‌ యాక్షన్‌, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌, ఖాన్సారా బ్యాక్‌డ్రాప్‌ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి.

శనివారం నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) ‘సలార్‌’ స్ట్రీమింగ్‌ మొదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్ అవుతున్నారు. గణతంత్రదినోత్సవం సందర్భంగా ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వస్తుందని అనుకున్నా, అంతకన్నా ముందే ప్రేక్షకులను నెట్‌ఫ్లిక్స్‌ సర్‌ప్రైజ్‌ చేసింది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌, ఈశ్వరిరావు, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

కథేంటంటే: ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి క‌ర్త రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు). ఆ సామ్రాజ్యంలోఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరూ దొర‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. క‌ర్త కుర్చీ కోసం కుతంత్రాలు మొద‌ల‌వుతాయి. నేనుండ‌గా నా కొడుకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌)ని దొర‌గా చూడాలనేది త‌న కోరిక‌గా చెబుతాడు కర్త రాజ‌మ‌న్నార్. కొన్నాళ్లు ఆయ‌న త‌న సామ్రాజ్యాన్ని వ‌దిలి తిరిగొచ్చేలోపు ఖాన్సార్ క‌థ మొత్తం మారిపోతుంది. కుర్చీ కుతంత్రాలు ప‌తాక స్థాయికి చేరుకుని వ‌ర‌ద రాజ‌మ‌న్నార్‌ని అంతం చేయ‌డం వ‌ర‌కూ వెళుతుంది వ్య‌వ‌హారం. అందుకోసం మిగ‌తా దొర‌లంతా త‌మ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు. వ‌ర‌ద త‌న సైన్యంగా చిన్న‌నాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌)ని పిలుస్తాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? త‌న ప్రాణ స్నేహితుడు వ‌ర‌ద కోసం దేవా ఏం చేశాడు? అత‌నికి స‌లార్ అనే పేరెలా వ‌చ్చింది? 25 ఏళ్ల‌పాటు ఊళ్లు మారుస్తూ త‌ల్లితో క‌లిసి ఒడిశాలో ఓ మారుమూల ప‌ల్లెలో త‌ల‌దాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?వీళ్ల జీవితంలోకి ఆద్య (శ్రుతిహాస‌న్) ఎలా వ‌చ్చింది? తెలియాలంటే మూవీ చూడాల్సిందే!

రివ్యూ: సలార్‌.. ప్రభాస్‌ ఖాతాలో హిట్‌ పడిందా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని