Rahul Ramakrishna: ప్రియదర్శితో నన్ను పోల్చొద్దు: రాహుల్‌ రామకృష్ణ

‘ఇంటింటి రామాయణం’(Intinti Ramayanam)తో ఇటీవల మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటుడు రాహుల్‌ రామకృష్ణ (Rahul Ramakrishna). తాజాగా ఆయన పెట్టిన ఓ పోస్ట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

Updated : 17 Jul 2023 14:44 IST

హైదరాబాద్‌: నటుడు ప్రియదర్శి(Priyadarshi)తో తనని పోల్చొద్దంటూ హాస్యనటుడు రాహుల్‌ రామకృష్ణ (Rahul Ramakrishna) విజ్ఞప్తి చేశారు. ‘‘నా ఆప్తమిత్రుడు ప్రియదర్శి.. నిబద్ధత, శ్రమించే మనస్తత్వం ఉన్నవాడు. ప్రియదర్శిని నాతో పోల్చడం అతడిని అవమానించినట్టే. అతడి గొప్పతనాన్ని తక్కువ చేసినట్టే అవుతుంది. ఈ పోలిక చాలా నాసిరకంగా ఉంది. నా స్నేహితుడికి నేను ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటా’’ అని చెప్పారు.

మొదటి సారి ప్రియుడి ఫొటోలు షేర్‌ చేసిన ఇలియానా

రాహుల్‌ రామకృష్ణ - ప్రియదర్శి ఎంతోకాలం నుంచి స్నేహితులు. ‘అర్జున్‌రెడ్డి’, ‘జాతిరత్నాలు’, ‘బ్రోచేవారెవరురా’ వంటి చిత్రాల్లో వీరిద్దరూ తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇక, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ‘బలగం’ ఈ ఏడాది ఆరంభంలో సూపర్‌ సక్సెస్‌ అందుకోగా.. రాహుల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘ఇంటింటి రామాయణం’ ఇటీవల విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రియదర్శి - రాహుల్‌ను పోలుస్తూ.. వీళ్లు సినిమాలతో అదరగొట్టేస్తున్నారంటూ ఓ నెటిజన్‌ తాజాగా పోస్ట్‌ పెట్టారు. దీనిపై రాహుల్‌ కాస్త అసహనం వ్యక్తం చేశారు. తన స్నేహితుడితో తనని పోల్చి చూడటం ఏమీ బాలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని