Ileana: మొదటి సారి ప్రియుడి ఫొటోలు షేర్‌ చేసిన ఇలియానా

నటి ఇలియానా (Ileana) మొదటిసారి తన ప్రియుడి ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి.

Updated : 17 Jul 2023 12:35 IST

హైదరాబాద్‌: హీరోయిన్‌ ఇలియానా (Ileana) మరికొన్ని రోజుల్లో తల్లి కానున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఎవరితో రిలేషన్‌లో ఉందో ఇప్పటి వరకూ చెప్పలేదు. తాజాగా ‘డేట్‌ నైట్‌’ అనే క్యాప్షన్‌తో తన ప్రియుడి ఫొటోలను మొదటి సారి షేర్‌ చేసింది. అయితే ఇలియానా అతడి పేరును మాత్రం చెప్పకపోవడం గమనార్షం. దీంతో నెటిజన్లు అతడి వివరాలు చెప్పాలంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

కల నెరవేరిన క్షణం.. ‘హరి హర వీరమల్లు’పై నిధి అగర్వాల్‌ పోస్ట్‌

ఇటీవల బేబీమూన్‌కు వెళ్లొచ్చిన ఇలియానా.. తన ఇన్‌స్టాలో ప్రియుడిని ఉద్దేశించి చేసిన పోస్ట్‌ వైరలైన విషయం తెలిసిందే. తాను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అతడు ఎంతో ధైర్యాన్నిచ్చాడని ఆమె చెప్పింది. ఎన్నో సందర్భాల్లో తనకు అండగా ఉండి తన కన్నీళ్లు తుడిచి నవ్వులు పూయించాడంటూ అతడిపై ప్రశంసలు కురిపించింది. తనకు ఎప్పుడు ఏం కావాలో అతడు అర్థం చేసుకున్నాడని.. అతడు పక్కన ఉంటే తనకు ఏదీ కష్టంగా అనిపించదని తెలిపింది.

ఇక తాను తల్లి కానున్నట్లు ఏప్రిల్‌లో ప్రకటించిన ఇలియానా.. ‘‘తల్లి కావడమనేది ఒక గొప్ప అనుభూతి. నాలో మరో జీవి ప్రాణం పోసుకుంటుందనే అనుభూతి ఎంతో మనోహరంగా ఉంది. దీన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా’’ అంటూ బేబీబంప్‌ ఫొటోలను పంచుకుంది. అయితే తాజాగా ప్రియుడి ఫొటోలను షేర్‌ చేయడంతో అవి వైరలవుతోన్నాయి. ఇక ‘దేవదాస్‌’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇలియానా.. గతకొంతకాలంగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని