Sam Bahadur: ప్రత్యర్థిని ఓడించడమే సైనికుడి కర్తవ్యం

‘నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. ఆర్మీనే నా జీవితం’ అంటున్నాడు విక్కీ కౌశల్‌. మరి ఆయనకు ఆర్మీ అంటే ఎందుకంత ఇష్టం? ఈ వృత్తి కోసం ఎలాంటి సాహసాలు చేశాడో తెలియాలంటే ‘సామ్‌ బహాదుర్‌’ సినిమా చూడాల్సిందే.

Updated : 14 Oct 2023 13:41 IST

‘నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. ఆర్మీనే నా జీవితం’ అంటున్నాడు విక్కీ కౌశల్‌. మరి ఆయనకు ఆర్మీ అంటే ఎందుకంత ఇష్టం? ఈ వృత్తి కోసం ఎలాంటి సాహసాలు చేశాడో తెలియాలంటే ‘సామ్‌ బహాదుర్‌’ సినిమా చూడాల్సిందే. భారతీయ మొదటి ఫీల్డ్‌ మార్షల్‌ సామ్‌ మానెక్‌షా జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మేఘనా గుల్జర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విక్కీకౌశల్‌, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. విక్కీ ఇందులో సామ్‌ మానెక్‌షా పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధానికి ఆయన సారథ్యం వహిస్తూ.. సైనికులకు ఏవిధంగా శిక్షణ ఇస్తున్నాడో చూపించారు. ‘ఒక సైనికుడి పని యుద్ధభూమిలో చనిపోవడమే’ అని ఇందిరా గాంధీ అంటే.. ‘ప్రత్యర్థివైపు ఉన్న జవాన్లను అంతమొందించడమే సైనికుడి కర్తవ్యమ’ని విక్కీ చెప్పిన డైలాగులు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇందిరా గాంధీ పాత్రలో ఫాతిమా సనాషేక్‌ నటిస్తుంది. డిసెంబరు 1న సినిమా విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు