Jayalalitha: కట్టుకున్నోడే చిత్రహింసలు పెట్టి.. యాసిడ్‌ పోస్తానని బెదిరించాడు: సీనియర్‌ నటి జయలలిత

జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు సీనియర్‌ నటి జయలలిత (Jayalalitha).

Published : 13 Sep 2023 18:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జీవితంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని సీనియర్‌ నటి జయలలిత (Jaya lalitha) అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా చనిపోవాలనే ఆలోచన రాలేదని, ధైర్యంగా ఎదుర్కొవాలని మాత్రమే అనిపించిందని ఆమె తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా పెళ్లి, తన భర్త వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు.

‘‘నేనొక క్లాసికల్‌ డ్యాన్సర్‌. దేశవ్యాప్తంగా దాదాపు 1000కు పైగా ప్రదర్శనలు ఇచ్చా. అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టా. కుటుంబం మొత్తం నాపై ఆధారపడి ఉండటంతో అప్పట్లో ఎలాంటి అవకాశాలు వచ్చినా కాదనకుండా నటించా. వినోద్‌ అనే దర్శకుడిని ప్రేమించా. మేమిద్దరం దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్నాం. అతడు తెరకెక్కించిన ఓ సినిమాలో నాతో అడల్ట్‌ సీన్స్‌ చేయించాడు. అతడికి దూరంగా ఉండాలనుకున్నా. పెళ్లికి అంగీకరించకపోతే చచ్చిపోతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. చేసేది లేక పెళ్లి చేసుకున్నా. పెళ్లైన తర్వాత రోజే అతడి నిజస్వరూపం తెలిసింది. ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని అర్థమైంది. చిత్ర హింసలు పెట్టాడు. యాసిడ్‌ పోస్తానన్నాడు. గదిలో బంధించాడు. సన్నిహితుల సాయంతో ఆ చెర నుంచి బయటపడ్డా’’ అని ఆమె చెప్పారు.

Vishal: అతడితో వర్క్‌ చేయడం ఎప్పటికీ జరగదు: విశాల్‌ ఆగ్రహం

మలయాళీ చిత్రాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె జయలలిత.. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించారు. ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘మామ అల్లుడు’, ‘లారీ డ్రైవర్‌’, ‘అప్పుల అప్పారావు’, ‘జంబ లకిడి పంబ’, ‘మెకానిక్‌ అల్లుడు’, ‘ముఠా మేస్త్రి’, ‘హంగామా’, ‘భరత్‌ అనే నేను’ వంటి చిత్రాల్లో ఆమె సహాయనటిగా కనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని