icon icon icon
icon icon icon

AP Election Voter Turnout: ఏపీలో 81.86 శాతం పోలింగ్‌: సీఈవో ముకేశ్‌కుమార్ మీనా

ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024) 81.86 శాతం పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు.

Updated : 15 May 2024 15:39 IST

అమరావతి: ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024) 81.86 శాతం పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్‌ బ్యాలెట్‌తో 1.2 శాతం పోలింగ్‌ నమోదైందని చెప్పారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తుది పోలింగ్‌ శాతం వివరాలను ఆయన వెల్లడించారు. 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్‌ కొనసాగిందని చెప్పారు. ఆఖరి పోలింగ్‌ కేంద్రంలో రాత్రి 2 గంటలకు ముగిసిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంలన్నీ 350 స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచామన్నారు. కొన్నిచోట్ల వర్షం వల్ల పోలింగ్ ఆలస్యమైందని చెప్పారు. అబ్జర్వర్లంతా పరిశీలన చేశారని.. రీపోలింగ్‌పై ఏమీ చెప్పలేదని సీఈవో వివరించారు. 

గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్‌ పెరిగిందని మీనా తెలిపారు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం నమోదైందని చెప్పారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 శాతం, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం నమోదైనట్లు వివరించారు. లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం, అత్యల్పంగా విశాఖ లోక్‌సభలో 71.11 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సీఈవో చెప్పారు.

లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ వివరాలు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img