Manu Charitra: కాజల్‌ అగర్వాల్‌ సమర్పణ.. ‘మను చరిత్ర’ టీజర్‌ చూశారా!

‘మను చరిత్ర’ టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. శివ కందుకూరి, మేఘా ఆకాశ్‌ ప్రధాన పాత్రధారులు.

Published : 07 Oct 2021 22:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘చూసీ చూడంగానే’ సినిమాతో ఆకట్టుకున్న నటుడు శివ కందుకూరి. ఈయన ప్రధాన పాత్రలో దర్శకుడు భరత్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మను చరిత్ర’. మేఘా ఆకాశ్‌, ప్రియ వడ్లమాని, సుహాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్‌ని చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. ‘వాడు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. వాడి ఏడుపు దేవుడికి వినిపించేంత.. మనుషులకి అర్థంకానంత’ అని కథానాయకుడి పరిస్థితిని ఉద్దేశించి సుహాస్‌ చెప్పిన సంభాషణతో టీజర్‌ ప్రారంభమైంది. యాక్షన్‌ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గోపీ సుందర్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రధానబలంగా నిలిచింది. ఏ డైలాగ్‌ చెప్పకుండానే పవర్‌ఫుల్‌ లుక్‌లో శివ విశేషంగా ఆకట్టుకున్నారు. ఓ సన్నివేశంలో స్టైలిష్‌ లుక్‌లో మెరిసి, సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. మరి ఇలా ఉండే వ్యక్తికి తుపాకి చేతపట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఎవరి కోసం అలా మారాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రముఖ నటి కాజల్‌ అగర్వాల్‌ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రొద్దుటూర్‌ టాకీస్‌ పతాకంపై శ్రీనివాస్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని