Dabangg 4: ‘దబాంగ్ 4’కి దర్శకుడు దొరికినట్టే!
సల్మాన్‌ఖాన్ పోషించిన పాత్రల్లో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న పాత్రల్లో ఒకటి చుల్‌బుల్‌పాండే. దబాంగ్ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడు చిత్రాల్లోనూ పోలీస్ అధికారి చుల్‌బుల్‌పాండేగా సల్మాన్ నటన ప్రేక్షకుల్ని
సల్మాన్‌ఖాన్ పోషించిన పాత్రల్లో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న పాత్రల్లో ఒకటి చుల్‌బుల్‌పాండే. దబాంగ్ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడు చిత్రాల్లోనూ పోలీస్ అధికారి చుల్‌బుల్‌పాండేగా సల్మాన్ నటన ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు ‘దబాంగ్ 4’ రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి దర్శకుడిగా తిగ్మన్షు దులియా దాదాపు ఖరారైనట్లే అనిపిస్తోంది. ఈ చిత్రం కోసం తిగ్మన్షు చెప్పిన స్టోరీ లైన్ సల్మాన్‌కు బాగా నచ్చిందట. దీంతో ఈ స్క్రిప్టుపై తిగ్మన్షు సంవత్సరం నుంచి కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే పూర్తి స్క్రిప్టుని సల్మాన్‌కు వినిపించనున్నారట. ‘పాన్ సింగ్ తోమర్’, ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్’ చిత్రాలతో అలరించారు తిగ్మన్షు. సల్మాన్ ప్రస్తుతం ఏడెనిమిది చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి ఈ కొత్త చిత్రం ఎప్పుడు పట్టాలెక్కనుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్‌కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు