VarunLav: మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్‌ తేజ్ - లావణ్య త్రిపాఠి

నటుడు వరుణ్‌ తేజ్‌ (Varun tej), నటి లావణ్య త్రిపాఠి (Lavanya tripathi)ల వివాహం వేడుకగా జరిగింది. కుటుంబసభ్యుల సమక్షంలో వరుణ్‌-లావణ్య ఏడడుగులు వేశారు.

Updated : 02 Nov 2023 11:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు ఆరేళ్ల తమ ప్రేమను వివాహబంధంగా మార్చుకున్నారు నటుడు వరుణ్‌  తేజ్‌ (Varun Tej) - నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్‌ మూడుముళ్లు వేశారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌.. ఇలా కొణిదెల, అల్లు కుటుంబానికి చెందిన అగ్ర, యువ హీరోలందరూ షూటింగ్స్‌ నుంచి బ్రేక్స్‌ తీసుకుని ఈ వేడుకల్లో సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నితిన్‌, ఆయన సతీమణి షాలినీ, నీరజా కోన ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. 

Naga vamsi: మేమింకా నిర్ణయం తీసుకోలేదు.. విశ్వక్‌సేన్‌ పోస్ట్‌పై స్పందించిన నాగవంశీ

2017లో ‘మిస్టర్‌’ సినిమా కోసం వరుణ్‌ - లావణ్య తొలిసారి కలిసి నటించారు. అప్పుడే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ మరుసటి ఏడాది వచ్చిన ‘అంతరిక్షం’లోనూ ఈ జంట ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే ఈ ఏడాది కాలంలో ఇద్దరి మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ‘‘దాదాపు ఐదారేళ్ల నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. నాకేదిష్టమో తనకు బాగా తెలుసు. మా అభిరుచులూ కలవడంతో మా మధ్య స్నేహం ప్రేమగా మారింది. నేనే ముందు ప్రపోజ్‌ చేశా. ఇరు కుటుంబాలూ మా ప్రేమను అంగీకరించాయి’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమకథను పంచుకున్నారు వరుణ్‌ తేజ్‌. తాను వాడుతున్న ఫోన్‌ని సైతం లావణ్యనే గిఫ్ట్‌గా ఇచ్చిందని చెప్పారాయన.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని