Varun tej: ఆపరేషన్‌ వాలెంటైన్‌.. విడుదల ఖరారు

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా తెరకెక్కించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది.

Updated : 12 Dec 2023 09:30 IST

రుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా తెరకెక్కించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. మానుషి చిల్లర్‌ కథానాయిక. ఈ సినిమా ఫిబ్రవరి 16న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా త్వరలో టీజర్‌ని విడుదల చేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు. ‘‘నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొంది ఈ దేశభక్తి చిత్రాన్ని రూపొందించాం. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను దీంట్లో చూపించనున్నాం. ఇందులో వరుణ్‌ తేజ్‌ ఇండియన్‌ ఎయిర్‌ పైలట్‌గా కనిపించనున్నారు. మానుషి రాడార్‌ ఆఫీసర్‌గా కనిపిస్తుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని